HarishRao:ఆరోగ్య తెలంగాణ ..వీఆర్‌ఏల క్రమబద్దీకరణ ఇంకా..!

47
- Advertisement -

ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డితో కలిసి హరీశ్‌రావు కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడించారు.

ఆరోగ్య శాఖలో రీ ఆర్గనైజింగ్ ప్రకారం 33జిల్లాలో డీఎంహెచ్‌వో పోస్టులను మంజూరు చేయనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 6జోన్లకు అనుగుణంగా 6డీఎంహెచ్‌వోలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కొత్తగా 40మండలాల్లో పీహెచ్‌సీలు మంజూరు చేసినట్టు తెలిపారు. అర్బన్ పీహెచ్‌సీలో కాంట్రాక్టు ఉద్యోగులకు బదులుగా పర్మనెంట్ ఉద్యోగులను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనికోసం సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌కు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. వనపర్తి జర్నలిస్టు అసోసియేషన్‌కు 10గుంటల స్థలం కేటాయించినట్టు తెలిపారు. అలాగే ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం 23ఎకరాలు స్థలం కేటాయింపు జరపాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు.

Also Read: Harishrao:ఎన్నడూ లేని విధంగా దశాబ్ది ఉత్సవాలు

మైనారిటీ కమిషన్‌లో జైన్ కమ్యూనిటీ యాడ్‌ చేస్తున్నట్టు కమిషన్ సభ్యులుగా ఒకరికి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అచ్చంపేట ఉమామహేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్ ఫేస్‌ 1, ఫేస్‌ 2 మంజూరు చేసినట్టు తెలిపారు. అలాగే టీఎస్పీఎస్సీలో 10పోస్టుల మంజూరు చేసిన్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

Also Read: బ్యాక్ టూ కాంగ్రెస్ ?

- Advertisement -