కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులుః మంత్రి ఈటెల

268
Etela-Rajender
- Advertisement -

తెలంగాణలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు నడుస్తున్నాయన్నారు మంత్రి ఈటెల రాజెందర్. పేద ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విధానాలు ప్రవేశ పెడుతున్నారని చెప్పారు. దేశంలో వైద్యంపై అత్యధికంగా ఖర్చుపెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

ప్రభుత్వ ఆసుపత్రిలలో సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈసందర్భంగా నగరంలోని నేచురోపతి, సరోజిని, నిలోఫర్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రిలలో పర్యటించి సమస్యలను అడిగి తెలిసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను తొందర్లోనే పరిష్కరిస్తామని చెప్పారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆసుపత్రులను అభివృద్ది చేసుకున్నట్లయితే పెద్ద ఆసుపత్రులపై భారం తగ్గుతుందని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ప్రభుత్వ వైద్యం మరింత చేరువ కావడానికి నాణ్యమైన వైద్యం అందిస్తామని తెలిపారు.

- Advertisement -