సోంపు వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా?

75
- Advertisement -

మనలో సోంపు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కొన్ని రకాల వంటల్లోనూ, అలాగే తీపి పదార్థాలలోనూ సుగంధ ద్రవ్యంగా సొంపును ఉపయోగిస్తుంటారు.చూడడానికి జీలకర్ర విత్తనాలను పోలివుండే ఈ ఫెన్నెల్ ( సోంపు ) విత్తనం పరిమాణంలో జీలకర్ర కంటే కాస్త పెద్దదిగా ఉంటుంది. ముఖ్యంగా బిర్యానీ వంటి ఆహారాన్ని తిన్న తరువాత సొంపు నోట్లో వేసుకోకపోతే ఏదే అసంపూర్గంగా ఉంటుంది. కొంతమంది ఇళ్ళల్లోనూ భోజనం తరువాత సొంప్ ఉపయోగిస్తుంటారు. అయితే సొంపు తినడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పటికీ కూడా చాలమందికి తెలియదు. భోజనం తరువాత సోంపు తినడంవల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

అలాగే తరచూ సోంపును నోట్లో వేసుకొని నమలడం వల్ల నోటి దుర్వాసన దూరం అవుతుంది. సోంపులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వును పెంచే కార్బోహైడ్రేట్ లను దూరం చేయడంతో పాటు, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. సోంపులో ఉండే పీచు పదార్థం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ నియంత్రనలో ఉంటుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది. అధిక రక్తపోటుతో భాడపడేవాళ్లు సోంపు గింజల్ని ప్రతిరోజూ ఒకటికి రెండు సార్లు నమిలితే మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా సోంపులో ఇంకా చాలమందికి తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

పటికబెల్లం పొడిలో కాస్త సోంపు వేసి బాగా మెత్తగా నూరుకోని కొద్దిగా ఒక గ్లాస్ నీటిలో ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ఒక స్పూన్ ఈ మిశ్రమాన్ని సేవిస్తే దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా ధూమపానం సేవించే వారికి ఉబుసం వ్యాధి తీవ్రతరం కాకుండా సోంపు నివారిస్తుంది. నేతితో వేయించిన సోంపునూ చూర్ణం చేసి, ఆ చూర్ణనికి సమపాళ్లలో పంచదార కలుపుకొని రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే అతి వేడి మూత్రంలో మంట వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సోంపు, దనియాలు, యాలకలు, సీమ బాదంపప్పు, పటికబెల్లం, వంటి వంటిని విద్విడిగా చూర్ణం చేసి, సమానంగా కలిపి పుంచుకొని ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలలో కలిపి తీసుకుంటే.. మతిమరుపు తగ్గి, జ్ఞాపకశక్తి వృద్ది చెందుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:దనియాల కషాయం..ఉపయోగాలు!

- Advertisement -