పంపర పనస పండు..ప్రయోజనాలు!

64
- Advertisement -

ఈ సృష్టిలో ప్రకృతి అనేది మనిషికి లభించిన వరం అనే చెప్పాలి, మన చుట్టూ ఉండే ఎన్నో చెట్లు, వాటి ఫలాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా సీజనల్ గా లభించే కొన్ని చెట్ల యొక్క ఫలాలను మాత్రం అసలు మిస్ కావొద్దని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో మాత్రమే లభించే ఫలాలలో పంపర పనస కూడా ఒకటి. నిమ్మ జాతికి చెందిన ఈ పండ్లలో ఎన్నో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. రుచిలో తీపి, ఒగరు, పులుపు కలగలిపి ఉండే ఈ పంపర పండ్లు తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. .

అందువల్ల శరీరంలో ఇమ్యూనిటీ స్థాయిని పెంచడంలో ఈ పంపర పనస పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతే కాకుండా షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో కూడా సహాయ పడతాయట. ఇంకా మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు ఈ పండ్లను కచ్చితంగా తినాలట. ఎందుకంటే ఇందులో జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇంకా అధిక బరువుతో బాధపడేవారు ఈ పండు జ్యూస్ ప్రతిరోజూ తీసుకుంటే త్వరగా బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్న మాట.

ఇంకా కీళ్ల నొప్పులు, ఎముకల వ్యాధులు వంటి వాటిని తగ్గించడంలో కూడా ఈ పంపర పనస పండు ఉపయోగపడుతుంది. శరీర భాగాలకు సక్రమంగా రక్తప్రసరణ జరపడంలోనూ, గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలోనూ, ఇంకా క్యాన్సర్ కారకాలను నివారించడంలోనూ ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సమర్థవంతంగా పని చేస్తాయట. ముఖ్యంగా చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ పొడిబారకుండా, వృద్దాప్య ఛాయలు రాకుండా ఉండేందుకు సీజనల్ గా దొరికే పంపర పనస పండును కచ్చితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:పవన్ ‘తమ్ముడు’ రీ రిలీజ్!

- Advertisement -