ఆకు కూరలతో ఆరోగ్య ప్రయోజనాలు?

155
- Advertisement -

ఆకుకూరలు తినే ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు మరియు ఆహార నిపుణులు తరచూ చెబుతూనే ఉంటారు. కానీ చాలామంది వాటిని పట్టించుకోకుండా జంక్ ఫుడ్ వైపే మొగ్గు చూపుతుంటారు. నిజానికి మనం తినే ఆహారంలో ఆకు కూరలు ఉండేలా చూసుకుంటే నేటి రోజుల్లో వస్తున్న ఆరోగ్య సమస్యలను సులభంగా అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలలో మన శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలు మెండుగా ఉండడంతో పాటు అనారోగ్య సమస్యలను నివారించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.ముఖ్యంగా ఆకు కూరలు కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. .

తోటకూర, బచ్చలి కూర, గోంగూర, పొన్నగంటి కూర, మునగాకు, మెంతికూర, కరివేపాకు ఇవన్నీ కూడా ఆకుకూరలుగా వంటకాల్లో మనం ఊయపయోగించేవే. వీటన్నిటిలో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజలతో పాటు విటమిన్ ఏ, కె, డి వంటి పోషకాలు కూడా సమృద్ది గా ఉంటాయి. ఈ పోషకాలు కంటి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అలాగే ఎముకలను శక్తివంతంగా తయారు చేయడంలో ఉపయోగ పడతాయి. ఆకు కూరల్లో లభించే ఫ్లెవనాయిడ్ లు మెదడు పని తీరును మెరుగు పరుస్తాయి.

అంతే కాకుండా క్యాన్సర్ కరాలకను దూరం చేస్తాయి. ఆకు కూరల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల హై బీపీ, బ్లడ్ ప్రెసర్ అదుపులో ఉంటాయి. ఆకు కూరల్లో ఐరన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రక్త హీనత సమస్యను తగ్గిస్తుంది. ఇంకా ఆకు కూరల్లో ఉండే బీటా కేటోరిన్, విటమిన్ సి వంటివి రోగనిరోధక శక్తిని పెంచేలా చేస్తాయి. బచ్చలి కూర, గోంగూర వంటి వాటిని ప్రతిరోజూ మనం తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె సమస్యలు కూడా తగ్గుతాయని పరిశుదనల్లో వెల్లడైంది. కాబట్టి వారంలో కనీసం మూడు లేదా నాలుగు రోజులు ఆకుకూరలతో చేసిన వంటకాలు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read:తెలంగాణ..ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

- Advertisement -