Fish Oil:చేపనూనెతో ఎన్ని ఉపయోగాలో!

61
- Advertisement -

సాధారణంగా కొవ్వు పదార్థాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని అందరూ భావిస్తారు. అందుకే కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అయితే కొవ్వు పదార్థాలన్నిటిలో చేపనూనె కొంత ప్రత్యేకం. చేప నూనెలో ఎన్నో ఔషధ గుణాలతో పాటు శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు చేప నూనెలో సమృద్దిగా ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా 3, విటమిన్ ఏ మరియు విటమిన్ డి వంటిది అధికంగా ఉంటాయి. అందువల్ల చేపలను తినడానికి ఇష్టపడనివాళ్ళు చేపనూనె తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేపనూనె మెదడు యొక్క చురుకుదనాన్ని పెంచుతుంది. .

అలాగే అధిక రక్తపోటును దూరం చేయడంలోనూ, మానసిక ఒత్తిడి తగ్గించడంలోనూ చేపనూనె ఎంతగానో ఉపయోగపడుతుందట. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు తగ్గించడంలో కూడా చేప నూనె ఎంతో ప్రయోజనకరంగా పని చేస్తుందని పలు ఆద్యాయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా కళ్ళకు ఎంతో మంచిదట. మూర్ఛరోగాన్ని తగ్గించడంలోనూ, అధికబరువును తగ్గించడంలోనూ, ఇంకా వివిధ రకాల చర్మసమస్యలను దూరం చేయడంలోనూ చేపనూనె ఎంతో కీలక పాత్ర వహిస్తుండట ముఖ్యంగా ఈ చేపనూనెను సాల్లోన్, డాల్ఫిన్, టూనా వంటి చేపల యొక్క కణజాలల నుంచి తయారు చేస్తారు.

దీనిని ఆయుర్వేదంలోనూ, మెడిసన్స్ లోనూ, ఇంకా న్యూట్రీషియన్స్ సప్లిమెంట్స్ లోనూ వాడతారు. అందువల్ల వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేపలను తినాలని లేదా చేప నూనె కలిగిన పదార్థాలనుగాని లేదా క్యాప్సూల్స్ గాని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక చేపనూనె వాడడం వల్ల ఉపయోగాలతో పాటు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. విటమిన్ ఏ మరియు ఒమేగా 3 అధిక మొత్తంలో ఉండే చేపనూనె తీసుకోవడం వల్ల అజీర్తి, టాక్సీసిటీ మైకం, వికారం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి చేపనూనెని నిపుణుల సలహా మేరకే తీసుకుంటే మంచిది.

Also Read:ఎన్నికల ప్రచారం..కారు నడిపిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -