మెంతినీరు త్రాగితే ఎన్ని లాభాలో..!

32
- Advertisement -

ప్రతిఒక్కరి ఒంటింట్లో ఉండే పదార్థాలలో మెంతులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే మెంతులు కూరల రుచిని ఎంతగా పెంచుతాయో, వివిధ రకాల రోగాల బారినుంచి కాపాడడానికి అంతే సమర్థవంతంగా పని చేస్తాయి. మెంతులలో ఎన్నో ఔషధగుణాలు క్దుయ ఉన్నాయి అందుకే ఆయుర్వేదాలలో కూడా మెంతులను ఉపయోగిస్తూ ఉంటారు. మెంతులలో ఫోలిక్ యాసిడ్, రైసోప్లావిన్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి ఎన్నో మూలకాలు ఉంటాయి. ఇంకా ఐరన్ మాంగనీస్, విటమిన్ ఏ, బి6, సి, కె వంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అత్యవసర పోషకాలే. అందుకే మెంతులను కూరల వేసుకోవడం చాలా మంచిదట. .

అయితే మెంతి గింజలలోని ఔషధ గుణాలను పొందాలంటే వాటిని నీటి రూపంలో తీసుకుంటే మరి మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మెంతులను నీటిలో వేసి మరిగించి ఆ తరువాత ఆ నీటిని ప్రతిరోజూ ఉదయం పడగడుపున తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చట. ముఖ్యంగా బరువును తగ్గించడంలో మెంతినీరు ఎంతగానో ఉపయోగ పడుతుందట. అంతే కాకుండా మలబద్దకంతో బాధపడే వారికి ఇదోక దివ్యా ఔషధంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా మెంతులలో ఉండే విటమిన్ సి, కె కారణంగా చర్మసమస్యలను తగ్గించడంలో కూడా సహాయ పడుతుందట. ప్రతిరోజూ మెంతినీరు త్రాగితే స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు తగ్గుతాయట. ముఖ్యంగా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక అప్పుడే జన్మనిచ్చిన మహిళలకు పాల ఉత్పతిలో కూడా మెంతినీరు కీలక పాత్ర పోషిస్తుందట. ఇంకా రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడం, గుండె కు రక్త ప్రసరణను మెరుగుపరదడం వంటి వాటిలో కూడా చక్కటి పనితీరు కనబరుస్తుందట మెంతినీరు. అందుకే ప్రతిరోజు ఉదయం పడగడుపున మెంతినీరు త్రాగే అలవాటు చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:Harish:అత్యాధునిక టెక్నాలజీతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ

- Advertisement -