నానబెట్టిన ఖర్జూరతో ప్రయోజనాలు తెలుసా?

17
- Advertisement -

డ్రై ఫ్రూట్స్ లో ఒకటిగా పరిగణించే ఖర్జూరాలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పోషకాల గనిగా ఖర్జూరలకు పేరు ఉంది. ఇందులో మన శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీర సంరక్షణలో ఉపయోగ పడడం తో పాటు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి. వీటిలో విటమిన్ ఏ, సి, ఇ, కె, బి6, బి12 వంటి పోషకాలతో పాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం మాంగనీస్, ఫైబర్, వంటి సూక్ష్మ పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.

ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే పడగడుపున వీటిని తింటే మంచి ఫలితాలు ఉంటాయట. రాత్రంతా ఖర్జూరాలను తేనెలో నానబెట్టి ఉదయం వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుందట. ముఖ్యంగా మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు దూరమవుతాయట. ఇంకా రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతాయట.

నానబెట్టిన ఖర్జూరాన్ని ప్రతిరోజూ ఉదయం తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో విటమిన్లు , కాల్షియం తగినంత మొత్తంలో ఉంటాయి, ఇది శరీరంలోని ఎముకలను బలోపేతం చేయడానికి , శరీరాన్ని బలోపేతం చేయడానికి చాలా ఉపయోగకరం. ఐరన్ పుష్కలంగా ఉండే ఖర్జూరం అలసటను తగ్గిస్తుంది ఖర్జూరంలో ఉండే విటమిన్లు , ఇతర పోషకాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి.

Also Read:కేరళలో విరిగిపడ్డ కొండచరియలు..వీడియో

- Advertisement -