మొక్కజొన్న పొత్తులు తింటున్నారా..!

41
- Advertisement -

సాయంకాలం పూట సరదాగా అలా బయటకు వెళ్లినప్పుడు రోడ్లపై అక్కడక్కడ వేడివేడిగా మొక్కజొన్న పొత్తులను ఫ్రెష్ గా కలుస్తుంటారు. అవి చూస్తే వెంటనే నోరూరుతుంది. ఈ వర్షాకాలంలో చినుకులు పడేటప్పుడు వేడి వేడిగా నిప్పులపై కాల్చిన మొక్కజొన్న పొత్తులను తింటూ ఉంటే ఆ అనుభూతి వర్ణనాతీతం. అయితే ఈ మన్ సూన్ సీజన్ లో మొక్క జొన్న పొత్తులను తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే తినకుండా అసలు ఉండలేరు. మొక్కజొన్నలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఫాస్ఫరస్, నియోసిస్, విటమిన్ బి6 వంటి వాటితో పాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మొక్కజొన్న తినడం వల్ల మన్ సూన్ సీజన్ లో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలకు కారణమయ్యే వైరస్, బ్యాక్టీరియా సులభంగా ఎదుర్కోవచ్చు.

Also Read:ట్రయాంగిల్ లవ్ స్టొరీ… ‘దిల్ సే’

ఇంకా కాల్చిన మొక్క జొన్నలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మొక్కజొన్నలలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది. ఇంకా ఇందులో ఐరన్ శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి రక్తహీనత వంటి సమస్యలు ఉన్నవాళ్ళు కాల్చిన మొక్కజొన్న పొత్తులను తింటే ఎంతో మేలట. ఇంకా ఇందులో కాల్షియం, విటమిన్ సి కూడా ఉంటుంది అందువల్ల ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ఇంకా షుగర్ వ్యాధితో బాధపడే వారు తప్పనిసరిగా మొక్కజొన్న పొత్తులను తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మొక్కజొన్నలను బాగా ఉడికించుకొని లేదా కాల్చుకొననా తరువాతనే తినాలి లేదనే జీర్ణ సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:సినీ స్టార్స్ పై పవన్ స్ట్రాటజీ?

- Advertisement -