‘చక్కి చలనాసనం’ వేస్తే ఎన్ని లాభాలో..!

58
- Advertisement -

చక్కి చలనాసనం.. ఈ ఆసనాన్ని తిరగలి ఆసనం అని కూడా అంటారు. గ్రామాల్లో ఏవైనా పిండి చేయడానికి తిరగలి వాడే వారు. ఆ తిరగలిని రుబ్బే ఆకారాన్ని పోలి ఉంటుంది కాబట్టి చక్కి చలనాసనానికి ఆ పేరు వచ్చింది. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. ముఖ్యంగా మహిళలు ఈ ఆసనం తప్పనిసరిగా ప్రతిరోజూ వేయాలని యోగా నిపుణులు చెబుతున్నారు. ఆడవారిలో ఋతుక్రమ సమస్యలు ఈ ఆసనం ద్వారా దురమౌతాయట. ఇంకా గర్భాశయ కండరాలను బలపరచడంలో కూడా ఈ ఆసనం ఎంతగానో ఉపయోగ పడుతుందట. అలాగే వెన్నెముక ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. పొట్ట చుట్టూ పెరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఉదర కండరాలను బలపరుస్తుంది. నడుం నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది.

చక్కి చలనాసనం వేయు విధానం
ముందుగా యోగా షీట్ పై కాళ్ళు చాపుకొని కూర్చోవాలి. కాళ్ళ మద్య కనీసం ఒక మీటర్ దూరం ఉండేలా చూసుకోవాలి. ఆ తరువాత చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచుతూ ఒకదానికొకటి ఫోటోలో చూపిన విధంగా పట్టుకోవాలి. ఆ తరువాత శ్వాస బాగా తీసుకొని శరీరానికి ముందుకు వంచుతూ కుడి వైపు నుంచి ఎడమ వైపునకు గుండ్రంగా రిపిటేషన్ చేయాలి. ఇలా రిపిటేషన్ చేసే క్రమంలో రౌండ్ కు ముందు శ్వాస తీసుకొని రౌండ్ పూర్తి అయ్యేటప్పుడు శ్వాస వదలాలి. ఇలా ఒక దశలో 5-10 రౌండ్లు చేసి మరో వైపు కూడా ఇదే విధంగా చేయాలి.

​గమనిక
గర్భవతులు ఈ ఆసనం వేయరాదు. అలాగే తక్కువ రక్తపోటు, మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనానికి దూరంగా ఉండాలి. అలాగే పొత్తికడుపులో సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా ఈ ఆసనానికి దూరంగా ఉండడం మంచిది.

Also Read:ముల్తానీ మట్టి మొఖానికి మంచిదేనా?

- Advertisement -