తమలపాకుతో ఆరోగ్యం…

381
- Advertisement -

తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పిల్లలకు వచ్చే జ్వరం నుంచి ఉపశమనం లభించాలంటే.. తమలపాకు రసంలో కస్తూరిని కలిపి పేస్ట్‌లా చేసుకుని తేనెతో కలిపి ఇవ్వడం చేస్తే జ్వరం తగ్గిపోతుంది. దగ్గు, జలుబును కూడా ఇది నయం చేస్తుంది. తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

తమలాపాకును కాసింత వేడి చేసి అందులో ఐదు తులసీ ఆకులను ఉంచి నులిమి రసం తీసుకుని 10 నెలల పిల్లలకు 10 చుక్కలు రోజూ ఉదయం, సాయంత్రం ఇస్తే జలుబు, దగ్గు నయం అవుతుంది.

తమలపాకును రుబ్బుకుని కీళ్లవాతం, మోకాళ్ల నొప్పులకు పూతలా వేసుకుంటే.. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకు రసం 15 మిల్లీ తీసుకుని వేడినీటిలో కలిపి తీసుకుంటే ఉబ్బసం, తలనొప్పి, కడుపునొప్పి నయం అవుతుంది.

శొంఠి, మిరియాలును సమంగా తీసుకుని తమలపాకు రసంలో తేనే కలుపుకుని తీసిస్తే ఆస్తమా నయం అవుతుంది.

ఊపిరితిత్తులకు సంబంధిత రోగాలను నయం చేసుకోవాలంటే.. తమలపాకు రసం, అల్లం రసం సమానంగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పిల్లల్లో అజీర్తికి చెక్ పెట్టాలంటే  తమలపాకుతో మిరియాలు చేర్చి కషాయం తీసుకుంటే సరిపోతుంది.

తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు గమనించారు. కాబట్టి సంతానంకోసం ప్రయత్నించేవారు తమలపాకును తొడిమ తొలగించి వాడుకోవాలి.

తమలపాకు, సున్నం, వక్క… ఇవి మూడూ చక్కని కాంబినేషన్. సున్నంవల్ల ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారటం) రాకుండా ఉంటుంది, తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియంను శరీరాంతర్గత భాగాల్లోకి చేరవేస్తే తమలపాకుకు చేర్చి వక్కపొడి లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి అరుగుదలకు సహాయపడుతుంది.

ప్రతిరోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధి ఉన్న వారికి చక్కని ఫలితం కనిపిస్తుంది. ప్రతిరోజూ రెండు నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.

తమలపాకుతోనూ కలిపి ముద్దగా నూరి చర్మం మీద లేపనం చేస్తే ఎగ్జిమా, తామర, దురదలు వంటి చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది.

Also Read: శివయ్య సాక్షిగా మూసి ప్రక్షాళన చేసి తీరుతా:రేవంత్

చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది. అదేవిధంగా తమలపాకు రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే మహిళల్లో క్షణికావేశాలు తగ్గుతాయి.

తమలపాకు షర్బత్‌ని తీసుకుంటే బలహీనత దూరమవుతుంది.తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.

తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది.తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.

- Advertisement -