నిమ్మకాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. మన డైలీ ఆహార డైట్ లో తీసుకుంటూనే ఉంటాము. వివిధ రకాల వంటలలో నిమ్మకాయను తరచూ వాడుతుంటాము. ఎందుకంటే ఇందులో ఉండే పులుపు వంటలకు చక్కని రుచిని కలిగిస్తుంది. ఇక సిట్రిక్ ఆమ్లం సమ్మేళనలతో విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని అనాటి కాలం నుంచి ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారు..
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో నిమ్మ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. గుండె, కాలేయం, మూత్ర పిండాల ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి. అయితే నిమ్మకాయ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనలు ఉన్నప్పటికి అతిగా తింటే ప్రమాదమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అల్సర్ ఉన్నవారు నిమ్మరసం గాని లేదా నిమ్మకాయ వాడిన పదార్థాలు గాని తీసుకోవడం వల్ల అల్సర్ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇంకా ఐరన్ ట్యాబ్లెట్స్ వాడుతున్న వారు నిమ్మరసం సేవిస్తే మందులపై ప్రభావం చూపుతుంది. నోట్లో పుండ్లు, పంటి నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు సైతం నిమ్మకాయకు దూరంగా ఉండాలని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read:ప్రధాని మోడీ బర్త్ డే..ఒకే చోట 74 మొక్కలు
ఇంకా నిమ్మకాయను అతిగా తింటే గొంతునొప్పితో పాటు గొంతులో పుండ్లు ఏర్పడే ప్రమాదం కూడా పొంచిఉందట. అందుకే నిమ్మకాయను తగు మాత్రమే ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఇక నిమ్మకాయ తొక్కలను ఎండబెట్టి పొడిలా చేసుకొని పేస్ ప్యాక్ లా కూడా వాడుతుంటారు కొందరు. అలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు వాడితే ఏ ప్రమాదం లేదు గాని రోజులో రెండు సార్లు వాడుతూ ఉంటే ఫేస్ పై పొక్కులు ఏర్పడే ప్రమాదం ఉందట. కాబట్టి నిమ్మకాయ విషయంలో కాస్త జాగ్రత్త్గ వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నా మాట.