ఆయన వల్లే ఇది చేశా..

227
He is a very supportive co-star-Tamanna
- Advertisement -

కళ్యాణ్‌రామ్ హీరోగా తమన్నా కథనాయికగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. పూర్తి లవ్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్, తమన్నా లుక్స్‌ ప్రేక్షకుల నుంచి మంచి స్పందని వస్తుంది.ఎప్పుడు మాస్ సినిమాలే ప్రాధాన్యాతనిచ్చే ఆయన ఈ సారి మాత్రం పూర్తి భిన్నంగా ప్రేమ కథతో కనిపించనున్నాడు.

 He is a very supportive co-star-Tamanna

చాలా స్టేలిష్‌గా కనిపిస్తూ లవర్ భాయ్‌గా దర్శనమివ్వబోతున్నాడు. ఇస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ ప‌తాకంపై జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్‌ను నిన్న (ఆదివారం) జరిగింది. ఈ సినిమాకు సంగీతం అందించారు శరత్.

తమన్నా ఈ సందర్భంగా మాట్లాడుతూ…కళ్యాణ్ రామ్ లేకుంటే ఈ సినిమా నేను చేసేదాన్నికాదని ఆమె అన్నారు. ఈ సినిమా పాటలు నాకు చాలా అద్భుతంగా ఉన్నాయని ఆమె తెలిపారు. మ‌హేశ్‌, కిర‌ణ్‌, విజ‌య్‌గారు మంచి ప్రోత్సాహం అందించారన్నారు. ఈ సినిమాకు రామ‌జోగ‌య్య‌గారు, అనంత శ్రీరామ్‌గారు మంచి సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందకు రానుంది.

- Advertisement -