మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో భేటీఅయిన అజారుద్దీన్..

222
minister srinivasgoud
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ తో మాజీ భారత జట్టు కెప్టెన్, HCA అధ్యక్షులు మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ లో భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో లాక్ డౌన్ తరువాత రాష్ట్రంలో క్రికెట్ క్రీడాకారులు క్రికెట్ ఆడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.క్రికెట్ క్రీడాకారులు బౌలింగ్ చేసేటప్పుడు బాల్ కు నోటిలోని ఉమ్మి ని అంటించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

క్రికెట్ క్రీడాకారులు క్రికెట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు గుంపుగా, దగ్గరగా ఉండి మాట్లాడుకోవడం, మ్యాచ్ గురించి చర్చించటo చేయరాదు అని మంత్రి సూచించారు.క్రికెట్ క్రీడాకారులు ప్రాక్టీస్ మ్యాచ్ లో మరో టీం కు చెందిన ఆటగాడు ఔటైనపుడు మిగితా క్రీడాకారులు చేతులు కల్పటం, ఒకరినొకరు పట్టుకొని ఆనందం వ్యక్తం చేయరాదన్నారు.

క్రికెట్ క్రీడాకారులు మ్యాచ్ ప్రాక్టీస్ లో తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలన్నారు. సానుటైజర్ ను వాడాలని, క్రీడాకారులు భౌతిక దూరం పాటించి కోవిడ్ పై ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ను పాటించాలని ఈ సమావేశంలో మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు HCA అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అజారుద్దీన్ కు సూచించారు.

క్రీడాకారుల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యమని మంత్రి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ క్రీడల అభివృద్ధి పై ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు శ్రీనివాస్ గౌడ్.

- Advertisement -