సీఎం కేసీఆర్‌ యువతకు ఆదర్శం: కేటీఆర్

185
ktr
- Advertisement -

కెసిఆర్ గారే యువతకి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆదర్శమని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ట్విట్టర్ లో ఆస్క్ కెటియార్ (#AskKtr)పేరిట ప్రజలతో సంభాషించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలక సమాధానం ఇచ్చారు. చదువుకున్న విద్యావంతులు ప్రజాస్వామిక ప్రక్రియలో భాగస్వాములుగా ఉండాలని ముఖ్యంగా చదువుకున్న యువత సైలెన్స్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి మంచిది కాదని అన్నారు.

రాష్ట్రంలో సిటీ బస్సులు, ఎంఎంటిఎస్ లు మరియు మెట్రోరైల్ వంటి సేవల ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కోసం వేచి చూస్తున్నామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య శ్రీ అత్యుత్తమమైన స్కీమ్ అని, నిజానికి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ నమూనా పైన ఆధారపడి ఉందని తెలిపారు.

త్వరలోనే ఎలిమినేడు ఏరోస్పేస్ పార్క్ కి శంకుస్థాపన ఉంటుందన్నారు.గ్రామీణ ప్రాంతాల డిజిటలైజేషన్ పైన కూడా స్పందించిన మంత్రి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మరో సంవత్సరంలో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని, దీంతోపాటు గ్రామ సీమల అభివృద్దికి పల్లె ప్రగతి లో భాగంగా పెద్ద ఎత్తున గ్రామాల్లో కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

అయోధ్య రామమందిరం నిర్మాణానికి తెలంగాణ యొక్క భాగస్వామ్యం ఏమిటన్న ప్రశ్నకు మంత్రి స్పందించారు. భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా కుల, మత, తరగతులకు అతీతంగా అందరికీ సమానమైన అవకాశాలు, గౌరవం వంటి లభించే రామ రాజ్యం రావాలన్న నా కోరికను ఆయన వ్యక్తం చేశారు.

తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలకు మరిన్ని అదనపు రాయితీలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

కేవలం హైదరాబాద్ పైనే మంత్రిగా మీరు దృష్టి సారిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలకు నిరంతరం నిధులు ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా లక్ష్యాలు పెట్టి వారితో పని చేయిస్తూ వాటిని సమీక్షిస్తున్నామని త్వరలోనే మంచి ఫలితాలు చూస్తారని మంత్రి అన్నారు.
- Advertisement -