నితీషాతో హెచ్‌సీఏ కెప్టెన్ వివాహం..

170
agarwal
- Advertisement -

హైదరాబాద్‌ రంజీ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ ఓ ఇంటివాడయ్యాడు. శంషాబాద్‌లోని క్లాసిక్‌ గార్డెన్స్‌లో నితీషాతో తన్మయ్‌ వివాహం ఘనంగా జరిగింది. భారత మాజీ కెప్టెన్‌, హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్‌, అర్షద్‌ అయూబ్‌, సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమి డైరెక్టర్‌ సీవీ ఆనంద్‌ తదితరులు వివాహానికి హాజరై తన్మయ్‌ని ఆశీర్వదించారు. ఇదే వేదికపై అతడి సోదరుడు సిద్ధాంత్‌-ముస్కాన్‌ ఒక్కటయ్యారు.

- Advertisement -