రాయుడుపై క్రమశిక్షణ చర్యలు…

587
ambati rayudu
- Advertisement -

హెచ్‌సీఏలో అవినీతిపై బహిరంగంగా ఆరోపణలు చేసిన హైదరాబాద్ కెప్టెన్ అంబటి రాయుడుపై చర్యలకు సిద్ధమవుతోంది హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ప్రతిష్ఠను రాయుడు దెబ్బతీసే ప్రయత్నం చేశారని.. ఈ విషయంలో రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బైలాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం ముందుకెళ్తాం అన్నారు.

ఈ ఘటనపై విచారణ అనంతరం అపెక్స్ కౌన్సిల్ తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ సెక్రెటరీ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. విజయానంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. డిసెంబర్ 6న ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారత్- వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య జరిగే తొలి టీ20 మ్యాచ్ తర్వాత రాయుడి విషయం తేల్చుతామన్నారు.

అయితే రాయుడిపై చర్యలకు సిద్ధమవుతున్న హెచ్‌సీఏపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబటిపై చర్యలు ఎందుకు తీసుకోవాలి? అతను చేసిన తప్పేంటి? అతనేమైనా అవినీతికి పాల్పడ్డాడా? హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కవల్జీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నాడు. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ మాజీ సెక్రెటరీ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. వెంకటేశ్వరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా రాయుడుకు మద్దతు పలికాడు. రాయుడు చెప్పేదంతా సత్యమని, దాన్ని తొక్కిపెట్టాలని ప్రయత్నించకూడదని మాజీ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. మొత్తంగా రాయుడిపై చర్యలకు ఉప క్రమించిన హెచ్‌సీఏ ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుబోతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

The Hyderabad Cricket Association (HCA) officials are not too happy with Ambati Rayudu’s ‘public outburst’.HCA Action against Ambati Rayudu

- Advertisement -