హైకోర్టులో చార్మికి చుక్కెదురు…

223
HC Rejects Charmi pition
- Advertisement -

డ్రగ్స్ కేసులో కోర్టును ఆశ్రయించిన సినీ నటి చార్మికి చుక్కెదురైంది. విచారణ సమయంలో అడ్వకేట్‌ను అనుమతించాలన్న చార్మి పిటిషన్‌ను న్యాయస్ధానం తిరస్కరించింది. అయితే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ కొనసాగించాలని కోర్టు సూచించింది. విచారణ పూర్తి కాకపోతే మరోసారి చార్మిని సిట్ కార్యాలయానికి పిలవొచ్చని తెలిపింది.  బలవంతంగా రక్త నమునాలు సేకరించవద్దని….విచారణ టీమ్‌లో మహిళా అధికారిని నియమించాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

చార్మి అంగీకారంతోనే ఆమె నుంచి బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరిస్తామని సిట్‌ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఆమె ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేపడతామని గతంలో ఆమెకు తెలిపామని.. ఇందుకు చార్మి స్పందించి విచారణ కోసం సిట్‌ కార్యాలయానికే వస్తానని తెలిపిందని చెప్పారు. మరోవైపు  సిట్‌ విచారణ చట్ట విరుద్ధంగా సాగుతోందని…  బలవంతంగా రక్తనమూనా సేకరణ చేయకుండా ఆదేశాలివ్వాలని చార్మీ తరఫు లాయర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

మరోవైపు డ్ర‌గ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా విచార‌ణ ముగిసింది. దాదాపు 4 గంట‌ల‌పాటు సిట్ అధికారులు చిన్నాని విచారించినట్టు తెలుస్తుంది. ప‌లు కోణాల‌లో సిట్ అధికారులు చిన్నాని విచారించిన‌ట్టు స‌మాచారం. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు విచారించిన వారి క‌న్నా చిన్నా విచార‌ణనే అధికారులు చాలా తొంద‌ర‌గా ముగించార‌ని చెప్పవ‌చ్చు. ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌ కు ఎక్సైజ్ కార్యాల‌యంలో చిన్నా విచార‌ణ ప్రారంభం అయిన సంగ‌తి తెలిపిందు. నిన్న న‌టుడు న‌వ‌దీప్ ను సిట్ అధికారులు రాత్రి 9.45 వ‌ర‌కు విచారించారు.

- Advertisement -