సల్మాన్‌ సీక్రెట్‌గానే కానిస్తున్నాడు..

244
- Advertisement -

సల్మాన్ చొక్కా విప్పాడంటే చాలు.. థియేటర్లలో అభిమానులు ఆనందంతో విజిల్స్ వేస్తుంటారు. ఈ బాలీవుడ్ బ్రహ్మచారికి లేడీ ఫ్యాన్స్‌ కూడా ఫిదా అయిపోతారు. అభిమానులు ముద్దుగా సల్లూబాయ్ గా  పిలుచుకునే ఈ స్టార్ హీరో చిందులేసినా ఫ్యాన్స్‌కి పండగే.

అయితే సల్మాన్‌ ఖాన్‌ గొప్ప డ్యాన్సర్‌ కాకపోయినా అతను వేసే స్టెప్పులు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అవుతాయి. సినిమాల్లో అయినా, అవార్డు ఫంక్షన్స్‌లో అయినా సల్మాన్‌ డ్యాన్స్‌ చేస్తున్నాడంటే అభిమానులు కళ్లప్పగించి చూస్తుండిపోతారు.

 salmankhan practice dance secretly

అయితే సినిమాల విషయానికొస్తే సల్మాన్‌ కొరియోగ్రాఫర్‌ చెప్పినట్లే డ్యాన్స్‌ చేయాల్సి ఉంటుంది. సల్లూభాయ్‌ త్వరలో రెమో డిసౌజా దర్శకత్వంలో ‘గో డ్యాడీ’ చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమా కోసం సల్మాన్‌ గత నెలరోజుల నుంచి రహస్యంగా హిప్‌ హాప్‌ డ్యాన్స్‌ నేర్చుకుంటున్నాడని సమాచారం.

ఇందుకోసం కొందరు ప్రొఫెషనల్‌ ట్రైనర్లను కూడా నియమించుకున్నట్లు బాలీవుడ్‌లో టాక్‌. ఒకవేల ఇదేగనక నిజమై..సల్లూభాయ్‌ డాన్స్‌ ని కూడా చించేస్తే…ఫ్యాన్స్‌ కూడా చిందేయాల్సిందేనేమో.

- Advertisement -