జాగ్రత్త.. తేడా వస్తే నాలా మాడిపోతారు !

274
Online News Portal
HAVE A SAFE AND HEALTHY DIWALI
- Advertisement -

దీపావళి జ్ఞాపకాలు ఆనందదాయకంగానే ఉండాలి. దేహం మీద గాయాలను చూసుకుని ఫలానా ఏడాది దీపావళి టపాకాయలు కాలుస్తున్నప్పుడు అంటూ… చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకునే పరిస్థితి రాకూడదంటున్నాడు నటుడు బ్రహ్మాజీ. ఏంటి ఈ ఫోటోలో అలా ఉన్నాడని అనుకుంటున్నారా? షూటింగ్‌లో దెబ్బలు తగిలాయేమోనని అనుకోవద్దు సుమా! ఎందుకంటే దీపావళిని సెలబ్రేట్‌ చేసుకుని గాయాల పాలుకావద్దంటూ ముందుగా హెచ్చరిస్తున్నాడు.

diwali

ఈ ఫోటోను స్వయంగా బ్రహ్మాజీ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేశాడు. పిక్ కింద హ్యాపీ దీపావళి అంటూ చిన్న కామెంట్‌ పెట్టాడు. దీపావళి శుభాకాంక్షలు చెబుతూనే జాగ్రత్తగా లేకపోతే ఇలా జరుగుతుందంటూ ముందుగా హెచ్చరించాడు.

కొన్ని జాగ్రత్తలు..
– నాణ్యమైన, గుర్తింపుగల కంపెనీలకు చెందిన పటాకులను మాత్రమే కొనుగోలు చేయాలి
– పిల్లలను ఒంటరిగా పటాకులు కాల్చేందుకు అనుమతివ్వరాదు. పెద్దవారు తప్పనిసరిగా వారి వెంట ఉండాలి.
– మైదానాలు, ఖాళీ స్థలాల్లో మాత్రమే పటాకులు కాల్చాలి
– పెట్రోల్‌బంక్‌లు, గ్యాస్ డిపోలు, గుడిసెలు, తాట్‌పత్రిలతో కట్టిన దుకాణాలు, మండే స్వభావం గల దుకాణాలు, ఇతర కేంద్రాలకు దగ్గరలో పటాకులు కాల్చవద్దు..
– చిచ్చుబుడ్లు(అనార్లు), రాకెట్లు, కాకర్‌పుల్లలు వెలిగించే సమయంలో వాటిని తలకు దూరంగా పెట్టి వెలిగించాలి. అవి కాలిపోయిన వెంటనే వాటికి దగ్గరగా ముఖం పెట్టి చూడడం చాలా ప్రమాదకరం.
– పొడవైన కాకరపుల్లలతో మాత్రమే పటాకులను వెలిగించడంగాని, పేల్చడంగాని చేయాలి.
– ముందుజాగ్రత్తగా దగ్గరలో కనీసం రెండు బక్కెట్ల నీటిని అందుబాటులో పెట్టుకోవాలి.

crackers-1
ప్రమాదాలు జరిగినప్పుడు..
– చిన్నచిన్న కాలిన గాయాలు జరిగిన వెంటనే గాయంపై నీరు పోయాలి.
– ఒంటికి మంటలు అంటుకున్న సందర్భంలో శుభ్రమైన కాటన్ బెడ్‌షీట్‌గాని, దుప్పటితో బాధితులకు అంటుకున్న మంటలను ఆర్పివేసి వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి.
– పటాకులను వెలిగించే సమయంలోగాని, వెలిగించిన తరువాతగాని అవి పేలి, ముఖానికి గాయాలైతే వెంటనే దగ్గరలో ఉన్న కంటి ఆసుపత్రికి వెళ్లాలి.. ఎందుకంటే ముఖానికి కాలిన గాయాలైనప్పుడు ముఖ్యంగా కళ్లపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

- Advertisement -