హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ

7
- Advertisement -

హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మేజిక్‌ ఫిగర్ 46 సీట్లు కాగా బీజేపీ 44 కాంగ్రెస్ 39 స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే వాస్తవానికి హర్యానాలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా అంచనాలన్ని తలకిందులయ్యాయి.

హర్యానాలో హ్యాట్రిక్‌ దిశగా బీజేపీ దూసుకెళ్తుండగా ఆ పార్టీ నేతలు అప్పుడే సంబరాలు మొదలుపెట్టారు. ఈనెల 5న ఒకే విడతలో 90 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో 67.9 శాతం పోలింగ్‌ నమోదుకాగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ), కాంగ్రెస్ మధ్య పోటి నెలకొంది.

Also Read:రాష్ట్రానికి రూ.11 వేల కోట్లు ఇవ్వండి: సీఎం రేవంత్

- Advertisement -