హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. జేజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బీజేపీకి సీఎం పదవి, జేజేపీకి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చేట్టు ఇరువర్గాలు అంగీకరించాయి. ఇరు పక్షాలు నేడు రాష్ట్ర గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై తమ నిర్ణయాన్ని తెలియజేయనున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ, హర్యానాలో స్థిరత్వం కోసమే కూటమి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
కాగా ఈనెల 21న హర్యానాలో ఎన్నికలు జరుగగా 24న ఫలితాలు వెలువడ్డాయి. హర్యాణాలో మొత్తం 90అసెంబ్లీ స్ధానాలకు గాను బీజేపీ 40గెలవగా, కాంగ్రెస్ 31స్ధానాలు గెలిచింది. 10 స్థానాలు నెగ్గిన జన్ నాయక్ జనతా (జేజేపీ) పార్టీ కింగ్ మేకర్ గా అవతరించింది. దాంతో బీజేపీ… జేజేపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమైంది. మొదట జేజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పగా అమిత్ షా కాంగ్రెస్ ఆ అవకాశం ఇవ్వకుండా జేజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారు.