నా కెరీర్ లో గేమ్ ఛేంజర్…హరోం హర

53
- Advertisement -

హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటివలే తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదలైన ‘హరోం హర’ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. నేషనల్ వైడ్ గా టీజర్ వైరల్ అవుతూ టాప్ ట్రెండింగ్ లో వుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్ సక్సెస్ సెలబ్రేషన్స్ ప్రెస్ మీట్ ని గ్రాండ్ గా నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. నా జీవితంలో నేను ఏం సాధించినా అది సూపర్ స్టార్ కృష్ణ గారి గిఫ్ట్. ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడూ వుంటాయని నమ్ముతున్నాను. మా ట్రైలర్ లాంచ్ చేసిన ప్రభాస్ గారు (తెలుగు) మమ్ముట్టి గారు (మలయాళం) టైగర్ ష్రాఫ్( హిందీ) విజయ్ సేతుపతి (తమిళ్) కిచ్చా సుదీప్‌ (కన్నడ )లకు ధన్యవాదాలు. ట్రైలర్ కి మంచి రీచ్, రివ్యూలు వచ్చాయి. ముందుగా నిర్మాత సుమంత్ గారికి థాంక్స్ చెప్పాలి. సాగర్ ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. కానీ చేయాలా వద్దా అనే ఆలోచనలో వున్నాను. ఎందుకంటే ఈ కథకు న్యాయం చేయాలంటే చాలా బడ్జెట్ అవుతుంది. ఐతే నిర్మాత సుమంత్ గారు.. ‘లెక్కలు వేసుకొని చేస్తే కేజీఎఫ్ లాంటి సినిమా వస్తుందా’ అని చాలా ధైర్యంగా ముందుకొచ్చారు. పరిశ్రమకు ఇలాంటి నిర్మాతలు కావాలి. మీ అందరి సపోర్ట్ వుండాలి. ఈ సినిమా విజయం తర్వాత మైత్రీ, సితార, వైజయంతి లాంటి బ్యానర్స్ లానే కథని నమ్మి ఎంతైన పెట్టె నిర్మాణ సంస్థగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ కూడా పరిశ్రమలోకి వచ్చినట్లేనని నమ్ముతున్నాను. ఈ చిత్రం వారికి మంచి రిటర్న్స్ తో పాటు రెస్పెక్ట్ తీసుకొస్తుందని భావిస్తున్నాను. సాగర్ నా కోసమే ఈ కథ రాసుకున్నాడు. తనకి అన్ని క్రాఫ్ట్స్ పై మంచి అవగాహన వుంది. నన్ను చాలా కొత్తగా ప్రెజెంట్ చేశాడు. టీజర్ చూసిన తర్వాత సుధీర్ బాబు లుక్ అదిరిపోయిందని అంటున్నారు. ఈ క్రెడిట్ సాగర్ కి దక్కుతుంది. తను ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. అందుకే టీజర్ అంత అద్భుతంగా వచ్చింది. నాకు ‘హరోం హర’ ఇచ్చిన సాగర్ కి థాంక్స్. డీవోపీ అరవింద్ విశ్వనాథన్ చక్కని పనితీరు కనబరిచాడు. అందుకే ఇంత వండర్ ఫుల్ అవుట్ పుట్ వచ్చింది. ఇందులో దాదాపు 90శాతం సెట్స్ లోనే చేశాం. ఆర్ట్ డైరెక్టర్ రాము గారు చాలా గ్రాండ్ సెట్స్ వేశారు. కొందరు సెట్స్ చూసి సలార్ సినిమా జరుగుతుందా అని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసేశారు. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో తన విశ్వరూపం చూస్తారు. పాటలు, నేపధ్య సంగీతం ఎక్స్ ట్రార్డినరీ గా వుంటాయి. ఎడిటర్ రవితేజ అదిరిపోయేలా కట్ చేశారు. ప్రొడక్షన్, డైరెక్షన్ టీం ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒకొక్క రోజు వెయ్యి మంది కూడా సెట్స్ లో వుండేవారు. అంత పెద్ద ప్రొడక్షన్ జరుగుతోంది. మంచి ఎమోషన్స్, చాలా హైస్ తో కమర్షియల్ కంటెంట్ వున్న చిత్రమిది. ఇందులో చాలా బలమైన పాత్రని పోషించాను. హరోం హర బాక్సాఫీసు వద్ద పెద్ద విజయాన్ని సాధిస్తుంది. నా కెరీర్ లో గేమ్ చెంజర్ అవుతుందనే నమ్మకం వుంది. అందరికీ థాంక్స్” అన్నారు.

Also Read:కాంగ్రెస్ ‘ కే‌టి‌ఆర్ ‘ స్థానాన్ని భర్తీ చేయగలదా?

- Advertisement -