మహిళలు తరచూ ఎదుర్కొనే సమస్యలలో హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఒకటి. పురుషులతో పోల్చితే మహిళల్లో ఈ హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడుతుంటారు మహిళలు. మొఖంపై అవాంఛిత రోమాలు రావడం, పీరియడ్స్ మిస్ కావడం.. ఇలా ఆయా సమస్యలు హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ కారణంగానే వస్తుంటాయి. మహిళల్లో హార్మోన్స్ చాలా మిశ్రమంగా ఉంటాయి. వీటిలో ఏ మాత్రం హెచ్చుతగ్గులు ఏర్పడిన అదనపు ఆరోగ్య సమస్యలు తప్పవు. ఏ పని చేయలేకపోవడం, నిద్ర లేమి, శృంగారంపై ఆసక్తి తగ్గడం, మానసిక ఒత్తిడి, డిప్రెషన్.. ఇవన్నీ కూడా హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ కారణంగానే మహిళల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు. .
ఇంకా కొందరు మహిళలకు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటాయి. వీటి కారణంగా హార్మోన్స్ లో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటాయి. కాబట్టి మహిళలు హార్మోన్స్ ను సమతుల్యం గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ను తగ్గించడంలో మెడిసిన్ కంటే క్రమమైన జీవన శైలి చక్కటి పరిష్కారం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా తినే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. విటమిన్స్, ఫైబర్, ప్రోటీన్స్ ఉన్న ఆహార పదార్థాలను తినాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా ఉండాలి.. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా హార్మోన్స్ ను సమతుల్యంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Also Read:చలికాలం..ఇలా చేద్దాం