హర్మన్‌ ప్రీత్..అరుదైన రికార్డు

1
- Advertisement -

ఆసియా కప్ 2026 లీగ్ దశలో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన చారిత్రక రికార్డును నెలకొల్పబోతున్నారు. పొట్టి ఫార్మాట్‌లో (T20I) భారత జట్టుకు కెప్టెన్‌గా 150వ మ్యాచ్‌కు నాయకత్వం వహించనున్న ఆమె, పురుషుల మరియు మహిళల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఒక T20I జట్టుకు 150 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా కొత్త చరిత్ర సృష్టించనున్నారు.

ఈ టోర్నీలో ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి భారత జట్టు మంచి ఫామ్‌లో ఉండగా, దాయాది పాకిస్థాన్‌పై కూడా అదే గెలుపు జోరును కొనసాగించాలని భావిస్తోంది. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం మాట్లాడిన హర్మన్‌ప్రీత్, జట్టు సాధించిన సానుకూల అంశాలపై సంతోషం వ్యక్తం చేశారు.

స్మృతి మందాన్న,షెఫాలీ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని, క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టు 200 పరుగుల సమీపానికి చేరి ఆ తర్వాత బౌలర్లు చక్కటి ప్రదర్శన చేశారని కొనియాడారు. మైదానంలో వాతావరణం, పిచ్ పరిస్థితులకు అలవాటు పడటం ఎంతో కీలకమని, తదుపరి మ్యాచ్‌లలో పరిస్థితులకు తగినట్లుగా ముందుకు సాగుతామని వెల్లడించారు.

Also Read:అభిషేక్ బర్త్‌డే..యువీ సర్‌ప్రైజ్

- Advertisement -