ఆటలో గెలుపు ఓటములు సహజమని అభిప్రాయపడింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిపై స్పందించిన హర్మన్…కొన్ని సార్లు విజయం సాధిస్తే మరికొన్నిసార్లు ఓటమి చవిచూడాల్సి వస్తుందని కానీ ఫైనల్‌గా అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామన్నారు. భారతజట్టుపై తనకు నమ్మకం ఉందని తిరిగి సత్తాచాటుతామని తెలిపారు హర్మన్.
ఆస్ట్రేలియా ఓపెనర్ హీలీ ఇచ్చిన క్యాచ్‌ను షెఫాలీ వర్మ అందుకోలేకపోయిందని అంతమాత్రాన ఆమెను నిందించాల్సిన అవసరం లేదని తెలిపింది. షెఫాలీకి ఇంకా 16 సంవత్సరాలేనని.. అందులోనూ ఆమెకి ఇది తొలి ప్రపంచకప్ అని వివరించింది.
ఈ టోర్నమెంట్‌లో షఫాలీ 5 ఇన్నింగ్స్‌లో కలిపి 163 పరుగులు చేయగా స్మృతి మందన్నా ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించలేకపోయింది. ఇక నెటిజన్లు కూడా షఫాలీకి అండగా నిలుస్తున్నారు. నువ్వు అసలైన ఛాంపియన్, భవిష్యత్తులో మరిన్ని ట్రోఫీలను జట్టుకు అందిస్తావు అని కామెంట్లు చేస్తున్నారు.