కెప్టెన్సీకి హర్మన్‌ ప్రీత్ గుడ్ బై!

1
- Advertisement -

భారత మహిళల సాధించిన ప్రపంచ కప్ విజేత కెప్టెన్, సీనియర్ క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు  ప్రకటించారు. ఇటీవల ఆసియా క్రీడలు 2026లో భారత జట్టుకు స్వర్ణ పతకం అందించిన తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అన్ని ఫార్మాట్ల (టెస్టులు, వన్డేలు, టి20లు) నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పటికీ, ఆటగాడిగా భారత జట్టులో కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు.

కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతూ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన భావోద్వేగ లేఖను పంచుకున్నారు. ఇది ఏమాత్రం సులువైన నిర్ణయం కాదు. నా జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు దీనితో ముడిపడి ఉన్నాయి. ఈ జట్టు కోసం, భారత మహిళల క్రికెట్ కోసం నా రక్తం, చెమట, సమయం.. అన్నీ ధారపోశాను. జట్టు ప్రయోజనాలే ముఖ్యమని భావించి, నా వ్యక్తిగత మైలురాళ్లను, ఎదుగుదలను కూడా పక్కనబెట్టిన సందర్భాలు ఉన్నాయి.

కెప్టెన్‌గా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అవి ఎప్పుడూ అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ ప్రతి నిర్ణయం వెనుక జట్టును మెరుగుపరచాలనే ఒకే ఒక ఉద్దేశం ఉంది. విజయాలు, ఘోర పరాజయాలు, విమర్శలు, వేడుకలు.. అన్నింటినీ చూశాను. ఈ రోజు మనస్ఫూర్తిగా, ప్రశాంతమైన హృదయంతో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాను. ఈ జట్టు సరైన మార్గంలో ఉందనే నమ్మకం నాకుంది. నాయకత్వం ముగిసినా, భారత క్రికెట్‌పై నాకున్న ప్రేమ ఎప్పటికీ మారదు. నా పయనంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ మొదటగా 2012లో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, భారత్‌కు ఆసియా కప్ అందించారు. ఆ తర్వాత 2016లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకుని భారత జట్టును విజయవంతంగా నడిపించారు. గౌహతిలో బిసిసిఐ (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియాతో హెడ్ కోచ్ అమోల్ ముజుందార్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. మూడు ఫార్మాట్లలోనూ స్మృతి మంధాన కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Also Read:అక్టోబర్ 9న ‘హనుమాన్ అంశ్’

వరల్డ్ కప్ సంచలనం: 2025లో సొంతగడ్డపై జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టును విజేతగా నిలిపారు. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి భారత్ ట్రోఫీ గెలవగా, ఆ మ్యాచ్ ఆఖరి క్యాచ్‌ను హర్మన్‌ప్రీత్ పట్టడం విశేషం.

 

 

View this post on Instagram

 

A post shared by Harmann (@imharmanpreet_kaur)

- Advertisement -