WPL:హర్మన్‌..అరుదైన రికార్డు

5
- Advertisement -

WPL (మహిళల ప్రీమియర్ లీగ్‌) 2026 సీజన్‌ ఉత్కంఠభరితంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ మహిళల జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించినప్పటికీ, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ మాత్రం తన ప్రదర్శనతో వార్తల్లో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌ జట్టు 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌ 17 బంతుల్లో 20 పరుగులు చేస్తూ చిన్న కానీ కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడింది. అయితే ఈ 20 పరుగులతోనే ఆమె ఒక గొప్ప రికార్డును బద్దలు కొట్టింది.

హర్మన్‌ప్రీత్ కౌర్‌ డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో భారత ఆటగాళ్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో మొత్తం 871 పరుగులు ఉండగా, ఇప్పటివరకు 865 పరుగులతో ముందున్న శఫాలి వర్మను ఆమె దాటింది. మొత్తం డబ్ల్యూపీఎల్‌ అత్యధిక పరుగుల జాబితాలో హర్మన్‌ప్రీత్ నాలుగో స్థానంలో ఉంది. ఆమెకంటే ముందుగా నాట్ స్కివర్-బ్రంట్‌, ఎలీస్ పెరీ, మెగ్ లానింగ్‌ ఉన్నారు.

Also Read:మద్యం సీసాలపై కూటమి తప్పుడు ప్రచారం!

- Advertisement -