రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ ఎన్నిక..

208
Harivansh Narayan Singh

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీయే కూటమిలోని జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. అధికార పక్షాల అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్.. విపక్షాల అభ్యర్థి బి.కె. హరిప్రసాద్‌పై 17 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హరివంశ్ నారాయణ్ సింగ్‌కు 122 ఓట్లు.. బి.కె. హరిప్రసాద్‌కు 105 ఓట్లు పోల్ అయ్యాయి. టీఆర్‌ఎస్ ఎన్డీయే అభ్యర్థికి ఓటేయగా.. టీడీపీ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసింది.. కాగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్ కు ప్రధాని అభినందనలు తెలియజేశారు.

Harivansh Narayan Singh

ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తరువాత వెంకయ్యనాయుడు నామినేషన్లు వేసిన హరివంశ్, హరిప్రసాద్ పేర్లను ప్రకటించి ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆ తరువాత లాబీలను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఆపై మూజువాణీ ఓటు ద్వారా హరివంశ్ గెలిచినట్టు ప్రకటించారు. విపక్ష సభ్యులు డివిజన్ కావాలని పట్టుబట్టడంతో ఓటింగ్ నిర్వహించారు. విపక్షాల అభ్యర్థి బి.కె. హరిప్రసాద్‌పై 17 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆపై పలువురు సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.