చిలుకూరు ఫారెస్ట్‌లో హరితహారం..

925
haritha haram
- Advertisement -

తెలంగాణకు హరితహారంలో భాగంగా చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఫీనిక్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం జరుగగా….150 ఎకరాల్లో పది వేల మొక్కలు నాటారు అధికారులు, సిబ్బంది, ఫీనిక్స్ సంస్థ ఉద్యోగులు.

సామాజిక బాధ్యతలో (CSR) భాగంగా చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లో అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు ఫీనిక్స్ సంస్థ చైర్మన్ సురేష్ చుక్కపల్లి. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి,ఎమ్మెల్యే కాలేరు యాదయ్య, చీఫ్ సెక్రెటరీ ఎస్‌కే జోషి, శోభ, సెక్యూరిటీ వింగ్ ఐజీ ఎంకే సింగ్,టీఎస్ ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -