భవిష్యత్ తరాల కోసం..హరితహారం

164
haritha haram
- Advertisement -

భవిష్యత్ తరాల కోసమే హరితహారం కార్యక్రమం అన్నారు తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ కేవై నాయక్‌.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ల సాగుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా మలేపల్లి ఐటీఐ లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు కేవై నాయక్‌.

ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంగం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంబీ క్రిష్ణ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. దేశంలోనే తెలంగాణ హరితహారం కార్యక్రమంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ నగేష్, డిప్యూటీ డైరెక్టర్ రాజా, బీఆర్‌కే మూర్తిఐటీఐ ప్రిన్సిపాల్,మరియు స్వప్న ,అజయ్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -