శుభకృత్ లో అంత శుభం జరగాలి: హరీష్‌ రావు

61
ugadi
- Advertisement -

తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి హరిశ్ రావు గారు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో , సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలని అని ఆకాంక్షించారు.. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తుందని , ఈ సంవత్సరం అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాదించాలనన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం సంతృప్తినిచ్చిందని , ఈ ఏడు కాలం తో ప్రమేయం లేకుండా కాళేశ్వరం జలాలతో కాలువలు, చెరువులు, కుంటల్లో నీళ్లు సమృద్ధిగా నిండి ఉన్నాయని రైతులు ఆనందం తో పాడి పంటలతో వర్ధిల్లాలన్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా తో పండగను వేడుక జరుపుకోలేక పోయామని , ఈ శుభకృత్ సంవత్సరం లో అన్ని పాలద్రోలి అన్నింటా అందరికి శుభం జరగాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు… ఈ కొత్త సంవత్సర పర్వదినం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకున్నారు.

- Advertisement -