సీఎం రేవంత్‌కు హరీశ్ రావు విషెస్

38
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు..రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్కకు శుభకాంక్షలు తెలియజేశారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు.

ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సరిగ్గా 1:20 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు.ఇదే వేదికపై రేవంత్ తో పాటుగా 12 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఖర్గే, కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం, హిమాచల్ సీఎం, ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలు తదితరులు హాజరయ్యారు.

Also Read:ప్చ్.. ‘హాయ్ నాన్న’ పరిస్థితి అంతేనా?

- Advertisement -