Harishrao:ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నాం

8
- Advertisement -

ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నాం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీష్… గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నారు.

ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ ఉద్యమం నుంచే బిఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఆనాడే ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం అందరికి విదితమే. ఎస్సీ వర్గీకరణ చేయాలని 16మే, 2016 నాడు ప్రధాని మోదీని స్వయంగా కలిసి లేఖ ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, తద్వారా విద్య, ఉద్యోగ అవకాశాల్లో యువతకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను అన్నారు.

Also Read:Harish Rao: మా ఆవేదన అర్థం చేసుకున్నారు..హరీశ్ థ్యాంక్స్

- Advertisement -