నాలాలు కబ్జా చేసి..బాధపడితే ఎలా?

7
- Advertisement -

నాలాలు కబ్జాలు చేసి ఇల్లు నిర్మించుకున్నాక వరదలు వస్తే బాధపడితే ఎలా ? అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట పట్టణంలో కురిసిన వర్షాలకు కోమటి చెరువు నాలా వరద ఉదృతికి గురైన ముంపు ప్రాంతాలు శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్, పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు.

ఈ సందర్బంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది… తొగుట మండలంలో 20 సెంటీమీటర్ల వర్షం పడి ప్రజలు ఇబ్బంది పడ్డారు అన్నారు. గత 20 సంవత్సరాలలో సిద్దిపేటలో ఇలాంటి వర్షం ఎప్పుడు పడలేదు… భారీ వర్షం వల్ల సిద్దిపేటలో పలు కాలనీలు జలమయమయ్యాయి … సిద్దిపేటలో వచ్చిన వరదను తగ్గించడానికి నర్సాపూర్ చెరువుకు ఒక మీటర్ తొలిగించాము అన్నారు.

నర్సాపూర్ చెరువు నీటిని శనిగరం వాగు,మందపల్లి వాగు వైపు నీళ్లు మళ్లించాం… భవిష్యత్తులో వరద వచ్చినపుడు ఎలా చర్యలు చేపట్టాలో ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు చేయాలని సూచించడం జరిగింది.. ప్రజలు కూడా సహకరించాలి అన్నారు. లోతట్టు ప్రాంతాలలో తక్కువ ధరకు వస్తున్నాయని ఇల్లు నిర్మాణం విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలి … రానున్న రోజుల్లో ప్రజలు సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు నిర్మించుకోకూడదు.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పరవేక్షణ చేయాలి.. ప్రజలు ఆందోళన చెందోద్దు అన్నారు.

Also Read:రుషికొండ భవనాలు దెబ్బతిన్నాయి:పవన్

- Advertisement -