Harishrao:కార్పొరేట్‌కు ధీటుగా సిద్దిపేట ప్రభుత్వ స్కూల్

31
- Advertisement -

సీఎం కేసీఆర్ ఆశయ సాధనలో భాగంగా ఈరోజు సిద్దిపేటలో కలలు కన్న ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. అన్ని వసతులు ఉంటే.. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే 5 కోట్లతో అభివృద్ధి చేశాం అన్నారు.

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి ముందుకు రాని వారు నేడు చేరుతున్నారంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి కారణం అన్నారు. అద్భుతమైన ఫలితాలు సాధించేలా స్టాఫ్ కృషి చేయాలన్నారు. తెలంగాణ రాక ముందు 60 ఏళ్ళలో 400 కాలేజీలు ఉంటే ఇప్పుడు 1340 జూనియర్ కాలేజీలు చేసుకున్నాం అన్నారు.

తెలంగాణ వచ్చినప్పుడు 30 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 34 కు పెంచుకున్నం అన్నారు. విద్య మీద దృష్టి పెట్టండి.. ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాను అని చెప్పారు హరీష్ రావు.

Also Read:ప్రోటీన్ల కోసం ఇవి తినండి…

- Advertisement -