సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఇస్నాపూర్ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు మంత్రి హరీశ్ రావు. పాఠశాల ఆవరణలో తిరిగి చూసి.. కిచెన్ డైనింగ్ హాల్ ను పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న భోజనం సదుపాయాల గురించి వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ఆదివారం కావడంతో విద్యార్థుల కోసం వండిన మటన్ కర్రీ, బిర్యాని మంత్రి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారానికి సంబంధించిన వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకుని వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకొని తాజా కూరగాయలు మాత్రమే విద్యార్థులకు వడ్డించాలని మంత్రి సిబ్బందికి సూచించారు.
క్యాంపస్ లో పేరుకుపోయిన చెత్తను వెంటనే ఇదించాలని పంచాయతీరాజ్ అధికారులకు ఫోన్ చేసి మంత్రి ఆదేశించారు. విద్యార్థులు ఉండే క్యాంపస్ శుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా రోగాల బారిన పడకుండా విద్యార్థులు ఉంటానని మంత్రి అధికారులను సూచించారు. అనంతరం మంత్రి విద్యార్థిననులతో కాసేపు ముచ్చటించారు. వారికి అందుతున్న విద్య, భోజనం వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు వారికి పాఠ్యపుస్తకాలు రావడం ఆలస్యమైందని సమస్యను పరిష్కరించాలని మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. వెంటనే మంత్రి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ రోనాల్డ్ రోస్ కి ఫోన్ చేసి వారికి కావాల్సిన పుస్తకాలు వెంటనే పంపించాలని ఆదేశించారు. వారికి ఇబ్బంది లేకుండా సమయానికి పుస్తకాలు అందించాలని మంత్రి సూచించారు.
అదేవిధంగా స్టూడెంట్స్‌కు అందుతున్న త్రాగునీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు మంత్రి హారీశ్ రావు. మిషన్ భగీరథ నీళ్లను విద్యార్థులకు అందించాలని అన్నారు. అవసరమైతే త్రాగునీరు వేడి చేసి విద్యార్థులకు అందించాలని తద్వారా రోగాల బారిన పడకుండా ఉంటారని అధికారులకు మంత్రి సూచించారు. అంతరం విద్యార్థులు ఎప్పటికప్పుడు వారి హాస్టల్ రూమ్స్ ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యంగా ఉండగలిగితే మంచిగా చదువుకోగలుగుతారని సూచించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.