వరద ప్రభావిత ప్రాంతాల్లో హరీశ్‌ రావు..

11
- Advertisement -

సూర్యాపేట, ఖమ్మవ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మాజీ మంత్రి హరీశ్ రావు. కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం రామచంద్రపురం గ్రామంలో కొట్టుకుపోయిన సాగర్ ఎడమ కాలువను పరిశీలించారు హరీశ్‌. ఆయన వెంట మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్ర రెడ్డి, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కిషోర్, తిరుమూర్తి లింగయ్య తదితరులు ఉన్నారు.

అనంతరం ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం. వరద బాధితులకు ఆహారం, నిత్యావసరాలు వస్తువులను పంపిణీ చేశారు. ఖమ్మం మంత్రుల వల్లే కాలువ కొట్టుకుపోయిందని ఈ సందర్భంగా రైతులు బీఆర్ఎస్ నేతలకు తెలిపారు.

ఖ‌మ్మం మంత్రుల వ‌ల్లే సాగ‌ర్ ఎడ‌మ కాల్వ‌కు గండి ప‌డింద‌ని, ఇందుకు సంబంధించిన ఆధారాల‌ను రైతులు చూపించార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు. ఇది ప్రకృతి విలయంతో తెగిన కాలువ కాదు.. కేవలం అధికార పార్టీ మంత్రులు చేసిన నిర్వాకం వల్లే తెగిందని రైతులు చెబుతున్న‌ట్లు జగ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్రజలకు ధైర్యం చెప్పవలసిన ముఖ్యమంత్రి రెండు రోజుల పత్తా లేకుండా పోయి తన తప్పును దాచిపెట్టుకోడానికి కేసీఆర్‌పై, మా పార్టీ పై విమర్శలు చేశారు. పెళ్లికి, చావుకి తేడా తెలియని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఓదార్పుకు వ‌చ్చారా..? సంబరాలకు వచ్చారా..? అర్థం కావ‌డం లేద‌ని జ‌గ‌దీశ్ రెడ్డి మండిప‌డ్డారు.

Also Read:యువ శాస్త్రవేత్త కుటుంబానికి సీఎం పరామర్శ

- Advertisement -