మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయితీ లు ఉంటే అన్నింటిలో డంప్ యార్డులు పూర్తయ్యాయి….. వైకుంఠధామాల నిర్మాణ పనులు అదే స్ఫూర్తితో గ్రామ గ్రామాన యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని తెలిపారు మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి జిల్లా చిక్ మద్దూరులో పర్యటించిన హరీశ్…జిల్లాలో అన్ని గ్రామ పంచాయితీలలో డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తి అయినందుకు గాను జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ హనుమంతరావుకి, సంబంధిత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పోటీ తత్వంతో ప్రజలకు సేవలందించారు….సంగారెడ్డి జిల్లాలో 647, మెదక్ జిల్లాలో 469 గ్రామపంచాయితీల్లో సెగ్రిగేషన్ పూర్తి చేసినందుకు జిల్లా అధికారులను, పంచాయితీ సిబ్బందిని అభినందిస్తున్నాం అన్నారు. రెండు జిల్లాల కలెక్టర్లు, ఎంపీడీవోలు, ఏఈలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు రాత్రింబగళ్లు కష్టపడ్డారని…. సంగారెడ్డి జిల్లాల్లో 647 గ్రామ పంచాయితీలు ఉంటే అన్నింటిలో డంప్ యార్డులు పూర్తయ్యాయని తెలిపారు.
చెత్త సేకరణ, సెగ్రిగేషన్ నిర్వహణ చేసి ఆదర్శ గ్రామ పంచాయితీగా రూపుదిద్దుకుందని…. మండల పరిధిలోని 38 గ్రామాల్లో డంప్ యార్డులు పూర్తి అయిందన్నారు. ఈ నెలాఖరుకు అన్ని 647 గ్రామాల్లో వైకుంఠధామాలు పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయి….. 116 రైతు వేదికలు ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేసేలా పనులు సాగుతున్నాయని చెప్పారు.