బస్తీ దవాఖానకు సుస్తీ?:హరీష్‌

12
- Advertisement -

తెలంగాణలో బస్తీ దవాఖానాలకు సుస్తీ పట్టిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నాడు కేసీఆర్ హయాంలో 4500 బస్తీ దవాఖానాలను ప్రారంభించి ప్రజల మన్ననలు పొందామని కానీ నేడు అదే బస్తీ దవాఖానాల్లో పేదలకు వైద్యం అందడం లేదన్నారు.

ఓల్డ్ లింగంపల్లిలో బస్తీ దవాఖానాను సందర్శించారు హరీష్ రావు. ఈ సందర్భంగా తమకు 4 నెలల నుండి జీతాలు రావడం లేదని తమ కష్టాలు హరీష్ రావుతో చెప్పుకున్నారు సిబ్బంది.

కొత్త వైన్ షాపుల అప్లికేషన్ ఫీజు 2 లక్షల నుండి 3 లక్షలు పెంచాడు… దరఖాస్తులు తక్కువ వచ్చాయని వారం రోజులు గడువు పెంచిండు ..మద్యం దుకాణాల మీద ఆదాయం మీద ధ్యాస తప్ప ప్రజల ఆరోగ్యం శ్రద్ద లేదా అని ప్రశ్నించారు హరీష్. కేసీఆర్ కిట్ ఎందుకు రావడం లేదు, బస్తీ దవాఖానలో మందులు ఎందుకు లేవు, వాళ్లకి జీతాలు ఎందుకు వస్తలేవని ఒక్క నాడు అయినా రివ్యూ చేశావా … మద్యం దుకాణాల గురించి తప్ప గరీబ్ వాళ్ళ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదు అన్నారు.

Also Read:కోమటిరెడ్డి Vs మంత్రి జూపల్లి

- Advertisement -