రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ టి.హరీష్ రావు తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచివాలయం లో ఆయన మొక్కను నాటారు.
అనంతరం మంత్రి టి.హరీష్ రావు గారు మాట్లాడుతూ.. పచ్చని చెట్టు తోడుంటే గృహమే ఆరోగ్యసీమ’ అని అన్నారు. వృక్షో రక్షతి రక్షిత: అని మన పెద్దలు చెప్పినట్లుగా మానవజాతి మనుగడకు మొక్కలే ప్రాణాధారమని, మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధిని సాధిస్తుందని భావించిన మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు దేశంలో ఎక్కడాలేని విధంగా తనదైన సృజనాత్మకతతో ప్రవేశపెట్టిన ‘తెలంగాణకు హరితహారం’ అనే కార్యక్రమం విజయవంతంగా అమలు చేయబడుతున్నదన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో గణనీయంగా పచ్చదనం పెరిగిందన్నారు.
Also Read:వారికి ” నో సీట్ ” అంటున్న బీజేపీ !
బృహత్తర లక్ష్యంతో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఒక అద్భుతమైన కార్యక్రమమని, నా పుట్టిన రోజు సందర్భంగా ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో పాల్గొని మొక్కను నాటడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సామాజిక బాధ్యతలో భాగస్వాములు కావాలని మంత్రి హరీష్ రావు కోరారు. కార్యక్రమంలో స్పెషల్ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి గారు చైర్మన్ ఏర్రొల శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.
Also Read:అన్ స్టాపబుల్.. ప్రతి ఒక్కరూ ఒక బ్రహ్మానందం