పోలీస్ అధికారులకు హరీశ్‌..స్ట్రాంగ్ వార్నింగ్

1
- Advertisement -

మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు ఘాటుగా స్పందించారు.ఏపీలో జరుగుతున్న పోలీస్ అధికారుల పరిణామాలను మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు.అధికారం ఉందని విర్రవీగితే ఏపీలో ఏమైందో చూశామంటూ తెలంగాణ పోలీసులను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కొందరు పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రస్తుతం పోలీసు అధికారు లు సస్పెన్షన్‌లు, అరెస్ట్‌లు ఎదుర్కొంటున్నా రని చట్టాలకు లోబడి పనిచేయకపోతే అదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

కాలువలకు గండ్లు పడితే.. 22 రోజులైనా పూడ్చలేక పోయిన అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఖమ్మం జిల్లా రైతులు సాగునీరు లేక అల్లాడు తున్నారని. మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. భూములు నెర్రలు వారుతున్నాయని.. అందుకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని ఆరోపించారు. ముగ్గురు మంత్రులున్నా ఖమ్మం జిల్లా రైతులను పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:Pawan: కత్తి పట్టిన పవన్

- Advertisement -