నాడు ధనయజ్ఞం…నేడు జలయజ్ఞం అయిందా: హరీశ్‌

2
- Advertisement -

శాసనసభలో చర్చ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అప్పులపై వాస్తవాలను వివరించారు మాజీమంత్రి హరీష్ రావు. ఈ అంశం చాలా ప్రాధాన్యత కలిగిన అంశం కాబట్టి వాస్తవాలను సభ ముందు పెడుతున్నాను…ఏవైనా సందేహాలు ఉంటే నేను మాట్లాడిన తర్వాత అడిగినట్లయితే పూర్తి వివరాలు మళ్లీ చెప్తాను అన్నారు. శాసనసభలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు ‘‘అబద్ధాలు చెప్పు, అవే అబద్ధాలను పదేపదే చెప్పు, మళ్ళీ మళ్ళీ చెప్పు, దబాయించి చెప్పు, బెదిరించి చెప్పు, పెద్ద గొంతుతో చెప్పు, ఎదుటివారి గొంతు నొక్కి చెప్పు, ఎన్ని విధాలైనా చెప్పు, కానీ, అబద్ధాలు మాత్రమే చెప్పు, ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం మాత్రం చెప్పకు’’ అన్నట్టుగా ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీది ప్రతిపక్షంలో ఉన్నా అదే తీరు, అధికారంలోనూ అదే తీరు…మా గొంతు నొక్కినా మేం నిజమే చెబుతాం. అర్ధరాత్రి నిద్రలో అడిగినా మేం నిజమే చెబుతాం..వివరాలకు వెళ్లే ముందు సభా సాక్షిగా ఆర్థిక మంత్రి భట్టి కి ఒక ఛాలెంజ్ అన్నారు. భట్టి విక్రమార్క చెప్పిందే చెప్పి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు..గత ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్ చేయలేదని, రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు, ఇవన్నీ పచ్చి అబద్ధాలు..మెస్ చార్జీలు పెంచలేదన్నారు, అది ఇంకా పెద్ద అబద్ధం.. మేం మాట్లాడుతుండగా అధికార పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను దొంగ దొంగ అని అనడం పద్ధతి కాదు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారూ దీన్ని మీరు సమర్థిస్తారా? చెప్పాలన్నారు.

ప్రభుత్వ ఆస్తులు అమ్మడం లేదు అని ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క అబద్ధం చెప్పారు… 26 జూన్ 2024 రంగారెడ్డి జిల్లాలో గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని ఎకరా రూ.75 కోట్ల చొప్పున రూ. 30 వేల కోట్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది. ..ఇదే భూమిపై టీజీఐఐసి వారు 20 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతున్నారు.. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీజీఐఐసీ ఉచితంగా భూములు ఇచ్చిన సందర్భం ఉంది,కాంగ్రెస్ ప్రభుత్వం భూములను అమ్మదు అని, టీజీఐసీ దగ్గర కుదువ పెట్టదు అని, ఒక్క రూపాయి కూడా తీసుకోదే అని, భట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పండన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అమ్మకుండా టీజీఐఐసీ ద్వారా ఈ భూములను అమ్మే ప్రయత్నం చేస్తుందని భట్టి చెప్పకనే చెప్పారు. ..టిఆర్ఎస్ ప్రభుత్వం దండు మల్కాపూర్ లో టీఎస్ ఐఐసీకి ఒక్క రూపాయి తీసుకోకుండా 400 ఎకరాల భూమిని ఇచ్చింది,మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు 75 కోట్లకు ఎకరం చొప్పున టీజీఐఐసీకి ఇస్తున్నది?. ఇండస్ట్రీలు వచ్చేందుకు ఉపయోగపడుతుంది, కాబట్టి ఉచితంగానే ఇవ్వండన్నారు.

ఫామ్ మేకనైజేషన్, డ్రిప్పు, స్ప్రింక్లర్లకు మేం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు, రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు. గురుకుల విద్యార్థుల మెస్ చార్జీలు ఒక్కసారి కూడా పెంచలేదు అని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు,ఈ అసెంబ్లీ సాక్షిగా భట్టి విక్రమార్క గారికి నేను ఛాలెంజ్ విసురుతున్నాను. మేం ఇవ్వలేదని మీరు రుజువు చేస్తే ఇక్కడే స్పీకర్ ఫార్మాట్లో నేను నా రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతాను అన్నారు. మీరు అబద్ధం చెప్పినట్టయితే, మీరు కూడా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయాలి,మెస్ చార్జీలు మేం పెంచింది నిజం, డ్రిప్పు, ఫామ్ మెకానైజేషన్ కు డబ్బులు ఇచ్చింది నిజం, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమాకు 2018 -19లో – రూ. 883 కోట్లు, 2019- 20లో రూ.950 కోట్లు, 2020-21లో- రూ.1456 కోట్లు, 2021-22లో – రూ.1166 కోట్లు, 2022-23లో రూ.1139 కోట్లు కట్టిందన్నారు.

సభలో మీరు పెట్టిన రిపోర్టులో కూడా ఏడాది కాంగ్రెస్ పాలనలో రూ. 1,27,208 కోట్లు కాంగ్రెస్ అప్పు చేసిందని చెప్పారు..మీరు మొదటి ఆర్థిక సంవత్సరమే రూ. 1,27,208 కోట్లు అప్పు చేశారంటే.. ఐదేళ్లలో రూ. 6 లక్షల 38వేల కోట్ల అప్పు అవుతుంది. ఎఫ్ ఆర్ బీ ఎం లిమిట్ పెరిగితే ఐదేళ్లలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తామని మీరు పెట్టిన రిపోర్టు ఆధారంగానే ఒప్పుకున్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాలని భట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. 2014లో రెవెన్యూ మిగులు రూ. 369 కోట్లు ఉంటే, 2022 23లో మిగులు రూ. 5994 కోట్లకు పెరిగిందన్నారు. 2023 24 బడ్జెట్ ఆర్ఈలో రూ. 1704 కోట్ల మిగులు బడ్జెట్ అని ఇదే భట్టి గారు ఆర్థికమంత్రిగా ఇదే సభలో చెప్పారు…అంటే సర్ ప్లస్ రాష్ట్రంగా రూ.1700 కోట్ల మిగులు బడ్జెట్ తో మా బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పాం అన్నారు. ఖర్చులు పోగా మిగిలే దాన్ని రెవెన్యూ సర్ ప్లస్ అని అంటారు. మేం కూడా రెవెన్యూ సర్ ప్లస్ గానే ఈ రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పాం..2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 68 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్. దశ దిశ లేని రాష్ట్రాన్ని దేశంలో అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి. రూ. 2 లక్షల 93 వేల కోట్ల బడ్జెట్ తో మీకు అప్పజెప్పాం అన్నారు.

మేం అధికారంలోకి వచ్చిన నాడు 2014 ఈ రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం రూ. 35 వేల 770 కోట్లు మాత్రమే…. 2023లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ. 1,53,837 కోట్లు. అంటే రూ. 35 వేల కోట్ల నుండి మేం 1,50,000 కోట్లకు ఆదాయాన్ని పెంచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపించాం అన్నారు. ఎక్స్ పెండిచర్ 2014లో రూ. 62,000 కోట్లు ఉంటే, 2022-23 లో రూ.2 లక్షల 4 వేల 85 కోట్లకు పెంచాం, తలసరి ఆదాయం 2014లో రూ.1,24,000 ఉంటే, 2023లో రూ.3 లక్షల 56 వేల 564,2014లో జి ఎస్ డి పి రూ.4 లక్షల 51 వేల కోట్లు ఉంటే. 2023 లో రూ.15 లక్షల 10 98 వేల కోట్లకు పెంచాము, కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు. అలాంటి ప్రత్యేక పరిస్థితులను మేం ఎదుర్కొన్నాము,కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒకటి పాయింట్ 1.75 శాతం ఎఫ్ ఆర్ బి ఎం పరిధి పెంచి అప్పు ఇచ్చింది కాపిటల్ ఎక్స్ పెండిచర్ కోసం అన్నారు.

2020- 21లో రూ.17,568 కోట్ల అప్పు, 2021-22 కరోనాలో రూ. 10,724 కోట్ల అప్పు, ఉదయ్ స్కీం బలవంతంగా కేంద్రం రుద్దితే రూ. 9000 కోట్ల అప్పు,రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన టాక్స్ డివల్యూషన్ను అప్పుగా తీసుకోమని కేంద్రం ఇచ్చినది రూ. 2,459 కోట్ల అప్పు, కరోనా వల్ల, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వంపై 40 వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పుల భారం పడింది, భట్టి విక్రమార్క గారి శ్వేత పత్రాల లెక్క ప్రకారం రూ. 6 లక్షల 71 వేల కోట్లు అన్నారు. అది తప్పు, ఈ 6 లక్షల 71 వేల కోట్ల అప్పులో… తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణకు వారసత్వంగా వచ్చిన అప్పు రూ. 72,658 కోట్లు, వివిధ సంస్థలకు గ్యారెంటీల రూపంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన అప్పు రూ. 15,000 కోట్ల రూపాయలు కూడా తెలంగాణ ప్రభుత్వంపై పడింది, రూ. 6,71,000 కోట్ల అప్పులో భట్టి గారి మేధస్సుతో 7 డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, రాష్ట్ర ప్రభుత్వ అప్పుని 2024 మార్చి వరకు కలిపి బీఆర్ఎస్ ఖాతాలో వేసి చెప్పడం మీకే చెల్లుతుందన్నారు. 2023 డిసెంబర్ నుండి 2024 మార్చి వరకు రూ.15,118 కోట్లు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పును కూడా మా ఖాతాలోనే వేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వారసత్వంగా వచ్చిన 72,000 కోట్లను కూడా మా ఖాతాలోనే కలిపారు,ఇలా రూ. 87 వేల కోట్లు చేయని అప్పును కూడా బిఆర్ఎస్ హయాంలో చేశామని అదనంగా చూపిస్తున్నారు. గోబెల్స్ ప్రచారం చేస్తున్న భట్టి గారికి అభినందనలు చెప్పారు.

Also Read:ఫార్ములా ఈ రేసుపై చర్చకు సిద్ధం: కేటీఆర్

2014 కంటే ముందు గ్యారంటీల పేరు మీద వారసత్వంగా వచ్చిన అప్పు రూ. 11,609 కోట్లు, డిసెంబర్ 23 నుండి మార్చి 24 వరకు భట్టిగారు చేసిన అప్పు రూ. 15,118 కోట్లు, వారసత్వంగా వచ్చిన అప్పు రూ. 72 వేల కోట్లు ఇవన్నీ మాపైన వేసి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు• రూ. 99, 385 కోట్లు మేము చేయని అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసి మీ తెలివిని ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు అవాస్తవాలను పదే పదే చెప్పడం సరైనది కాదు,కాళేశ్వరం, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది..ఎఫ్ ఆర్ బి ఎం అప్పు రూ. 3,89,673 కోట్లు, కార్పొరేషన్ అప్పులు రూ. 1,27,208 కోట్లు, గవర్నమెంట్ గ్యారెంటీ లోన్స్, కట్టవలసిన అవసరం లేనిది రూ. 95 వేల కోట్లు, గవర్నమెంట్ గ్యారెంటీ ఇవ్వనిది, గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేనిది రూ. 59,000 కోట్లు,గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేని అప్పు మొత్తం 1,54,876 కోట్లు, అంటే మొత్తంగా శ్వేత పత్రంలో మీరు చూపించిన రూ.6 లక్షల 71 వేల కోట్ల నుండి మేం తీసుకోని అప్పు రూ. 99,385 కోట్లు, ప్రభుత్వం కట్టవలసిన లేని అప్పు 1,54,876 కోట్లు తీసేస్తే, బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ. 4 లక్షల 17 వేల కోట్లు మాత్రమేనన్నారు.

గోరంతని కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ..ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 1,27000 కోట్ల అప్పు చేసిందని నిజం ఒప్పుకున్నందుకు భట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు,ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అని పదేపదే భట్టి విక్రమార్క గారు అడుగుతున్నారు దానికి మా సమాధానం,కేసీఆర్ గారి హయాంలో ఈ రాష్ట్ర రైతాంగానికి మొత్తం రూ. 4 లక్షల 8 వేల 902 కోట్లు ఇచ్చాం, ఇందులో రైతుబంధుకు రూ. 73,162 కోట్లు ఇచ్చాం, రైతు బీమా కింద రూ. 5,465 కోట్లు ఇచ్చాం,రైతు రుణమాఫీ కోసం 28000 కోట్లు,రైతులకు ఉచిత విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 65 వేల కోట్లు ఇచ్చాం,నీటిపారుదల ప్రాజెక్టుల కోసం రూ. 2,37000 కోట్లు ఖర్చు చేశాం, ఇలా ఈ రాష్ట్ర రైతంగం కోసం 4,08,902 రూపాయలను ఖర్చు చేసింది కేసీఆర్ ప్రభుత్వం, దాని ఫలితమే ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు వరి ధాన్యం ఉత్పత్తి కేవలం 68 లక్షల టన్నులు మాత్రమే ఉంటే. ఇవాళ ఉత్పత్తి 1 కోటి 68 లక్షల టన్నులకు పెరిగింది. ,రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1 కోటి 31 లక్షల ఎకరాల నుండి 2 కోట్ల 28 లక్షల ఎకరాలకు పెరిగింది,ఔటర్ రింగురోడ్డు పైన నేను విచారణ కోరుకున్నప్పటికీ, విచారణ చేస్తామని ముఖ్యమంత్రి గారు లేచి చెప్పారు. విచారణకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు విచారణ చేసుకోండి,ముఖ్యమంత్రి ఎంత కన్వీనెంట్ గా మాట మారుస్తారనేది అసెంబ్లీ సాక్షిగా ఈరోజు రుజువైంది..భట్టి గారు పదేపదే లేచి ఓఆర్ఆర్ అమ్ముకున్నారని పదేపదే అంటుంటే.. ఆ ఒప్పందాన్ని రద్దు చేయండి అని కోరాము. ముందు ఓఆర్ఆర్ టెండర్లను రద్దుచేసి ఆ తర్వాతే దానిపై విచారణ జరిపించండి. బిఆర్ఎస్ అప్పులను మేము కట్టామని, భట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని ఆస్తులను కూడా పెంచిందన్నారు.

వారసత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అప్పులను మేం తిరిగి కట్టాం. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్ల పాలనలో 3 లక్షల కోట్ల రూపాయల అప్పులకు మిత్తీలను చెల్లించింది. ..అప్పుల పేరు చెప్పి, ఇచ్చిన హామీలను మీలాగా ఎగగొట్టలేదు,వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించి మరీ నమ్మించారు,ఏడాది గడుస్తున్నా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడంతో ప్రజల్లో మీ గ్రాఫ్ పడిపోతున్నది.,ఇప్పుడు ఆర్.బి.ఐ. లెక్కలకు వస్తే… ఆర్.బి.ఐ. ఇచ్చిన రిపోర్టులో పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి విషయాలను వెల్లడించింది. తెలంగాణలో నిరుద్యోగిత 2013 – 14లో ప్రతి 1,000 కి 65 ఉంటే అది మేం దిగిపోయే నాటికి 35 వరకు తగ్గించాం. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేట్ ప్రతి 1,000 కి 94 ఉంటే దాన్ని 73 వరకు తగ్గించాం. పేదరికం పావర్టీ ఇండెక్స్ మేం అధికారంలోకి వచ్చిన 2014 నాడు 13.18 శాతం ఉంటే మేం దిగిపోయిన నాటికి 5.88% వరకు తగ్గించాం.తలసరి ఆదాయాన్ని 3 లక్షల 56 వేల 564 వరకు పెంచాం. జిఎస్ డిపి రూ. 4,80,000 కోట్ల నుండి మూడింతలు 15 లక్షల కోట్ల వరకు పెంచాం. అగ్రికల్చర్ GVA రూ. 47.9 వేల కోట్ల నుండి రూ. 1,2,000 కోట్లకు పెంచాం. మ్యానుఫ్యాక్చరింగ్ GVA రూ. 57 వేల కోట్ల నుండి రూ.1,23,000 కోట్లకు పెంచాం. ఇండస్ట్రియల్ GVA రూ. 1 లక్ష 200 కోట్ల నుండి రూ. 2,45,000 కోట్లకు పెంచాం. గ్రోన్ ఏరియా ఇన్ థౌసండ్ హెక్టార్స్ 6,288 నుండి 9278 పెంచాం. నెట్ ఇరిగేషన్ ఏరియా తౌసండ్ హెక్టార్స్ 2289 నుంచి 3866 వేల హెక్టార్లకు పెంచాం. రైస్ ప్రొడక్షన్ ఇన్ 1000 టన్స్ 5755 నుండి 16, 874 కోట్లకు పెంచాం. ఫుడ్ గ్రీన్ ప్రొడక్షన్ ఇన్ తౌసండ్ టన్స్ 9147 నుంచి 20276 వేల టన్నులకు పెంచాం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 90 లక్షల 71 వేల కోట్ల నుండి 1 కోటి 87 లక్షల 82 వేల కోట్లకు ఓన్ టాక్స్ రెవెన్యూలో 29 వేల కోట్ల నుండి 1,31,000 కోట్లకు పెంచాం. పర్ క్యాపిటా అవైలబిలిటీ అఫ్ పవర్ 1151 కేవీ నుంచి 2300 కేవీ కి పెంచాం. నాలుగు లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు, ఏం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుంటే మేము ఏం చేసామో చెప్తున్నాం అధ్యక్షా. ఒక ఏడాదిలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తా అని ఇదే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ప్రకటిస్తే. అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డి గారు ఆశ్చర్యపోయి ఎలా ఇస్తారు? అని ముక్కున వేలేసుకున్నారు. ఈరోజు 24 గంటల ఉచిత కరెంట్ రైతులకు ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారే. ప్రశ్నించే గొంతులను నొక్కి అక్రమ కేసులు పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ నైజంగా మారింది. ఈ రాష్ట్రం కోసం పనిచేసిన కేటీఆర్ గారి పైన మీరు తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సభలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే, మీరు దాన్ని డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు టిడిపిలో ఉన్నప్పుడు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అన్న మాటలు మీకు గుర్తు లేదా?, మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ధనయజ్ఞం.. ఈ రోజు జలయజ్ఞం అయిందా ? , పారదర్శకంగా కేటీఆర్ గారు రాష్ట్ర ఇమేజ్ పెంచేందుకు ఫార్ములా కార్ రేసింగ్ నిర్ణయం తీసుకున్నారు. మీరు చేసేది నిజమైతే ఇదే శాసనసభలో చర్చ పెట్టి వాస్తవాలను చెప్పండన్నారు.

- Advertisement -