Harishrao:ముక్కలవుతున్న ఇండియా కూటమి

23
- Advertisement -

తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్..పటాన్‌చెరులో గెలిచామనే తీపి, మన ప్రభుత్వం రాలేదని చేదు ఉంది. ఇది తీపి చేదుల ఉగాది పచ్చడి అన్నారు. ప్రజలకు మనపై ఎంతో నమ్మకం ఉన్నది. కేవలం 1.8 శాతం ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం. మనకు 39 సీట్లు వచ్చాయి. ప్రజలకు కాంగ్రెస్ పాలన తీరు అర్థమైందన్నారు.

కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మించారు. ప్రగతి భవన్, కొత్త సచివాలయం నిర్మించారు. విపక్షాలు దుష్ప్రచారం చేశాయి. కాంగ్రెస్ ఇప్పుడు వాటినే వాడుకుంటోంది.ప్రగతి భవన్‌లో 150 రూములు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ అప్పట్లో ఆరోపించారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా అడిగితే తల కిందికి వేసుకున్నాడు.కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నాం. మేమేం తొందరపడడం లేదు. మీరు చెప్పిన తేదీల్లో అమలు కాలేదు కాబట్టే ప్రశ్నిస్తున్నాం.రైతుబంధు ఇస్తున్నామని నేను చెబితే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసి ఆపించారన్నారు.

కాంగ్రెస్ పెంచిన రైతుబంధును ఇవ్వకుండా మాట తప్పింది. వడ్లకు బోనస్ ఇవ్వలేదన్నారు.వృద్ధులకు 4 వేల పింఛన్ ఇస్తామని ఇవ్వలేదు. జనవరిలో 2 వేల పింఛన్ కూడా ఇవ్వలేదు అన్నారు.ఒక నెల పింఛన్ ఎగ్గొట్టారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని…ఇళ్లకు ఉచిత కరెంట్, 15వేల రైతు బంధు, డిసెంబర్ 9న రుణమాఫీ.. ఇలాంటి జూటా మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 15 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆరున్నర లక్షల మంది ఆటోడ్రైవర్లను రోడ్డున పడేశారన్నారు. పింఛన్ ఎగవేత, రైతుబంధు ఇవ్వకపోడం, మాట ప్రకారం ఫిబ్రవరి 1న గ్రూప్ 1 జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం కరెంటు కోతలు, కాలిపోతున్న మోటార్లు…కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదేనని చురకలు అంటించారు.

Also Read:ట్రెండీ పాలిటిక్స్..!

- Advertisement -