ఈటల రాజేందర్ తిన్నింటి వాసాలు లెక్కబెట్టారన్నారు మంత్రి హరీశ్ రావు. గజ్వేల్ నియోజకవర్గ విశ్వకర్మ, విశ్వ బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన హరీశ్…బి అర్ ఎస్ కు, కేసీఆర్ కు మీరంతా మద్దతు తెలపడం సంతోషకరం. కృతజ్ఞతలు తెలిపారు.నీళ్ళు, నిధులు, నియామకాలు నినాదం లేదనీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను కించపరిచేలా రేవంత్ రెడ్డి మాట్లాడారన్నారు. జయశంకర్ ప్రజల మనుసులో నుండి పుట్టించారు ఆ నినాదాన్ని అన్నారు.
జయశంకర్ సారు ఆశయాల స్పూర్తితో కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. తెలంగాణ తొలి సీఎం ఎవరు అంటే గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అంటారన్నారు. గజ్వేల్ కు గొప్ప పేరు ఉంది. ఇంకా చేస్తారన్నారు. ఈటల రాజేందర్ అన్నం పెట్టిన చెయ్యికి సున్నం పెట్టిండు….ఆయన్ని ఎమ్మెల్యే చేసింది, మంత్రి చేసింది, శాసన సభ పక్ష లీడర్ చేసింది కేసీఆర్ కాదా ఆలోచించాలన్నారు.
దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ పథకం అందేలా చూస్తామని చెబుతున్నా అన్నారు.బిజెపికి ఓటు వేసినా మోరిలో ఓటు వేసినా ఒక్కటేనని…కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా గెలిపిస్తే గజ్వేల్ పేరు మరోసారి మారు మోగుతుంది. చరిత్ర సృష్టిస్తుంది. అందుకు అందరం కృషి చేయాలన్నారు. ప్రజ్ఞాపూర్ కు చెందిన పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.
Also Read:KCR:ఇందిరమ్మ రాజ్యమంటే ఎన్‌కౌంటర్లే