నిద్రలో కూడా కేసీఆర్ జపమే:హరీశ్

6
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్ పేరు తలచుకుంటున్నాడు అన్నారు మాజీ మంత్రి హరీశ్‌రావు. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్‌లో శనివారం నాడు నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సుకు హాజరయ్యారు హరీశ్‌రావు .

ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ ద్రోహుల లిస్ట్ రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడుది ఉంటే, రెండో పేరు రేవంత్ రెడ్డిది ఉంటది అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతాడు… తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారుల పైకి రేవంత్ రెడ్డి రైఫిల్ తీసుకొని వెళ్లిన ద్రోహి అని మండిపడ్డారు.

Also Read:ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు సంచలన తీర్పు..

సీఎం రేవంత్ రెడ్డికి నచ్చని ఒకే ఒక నినాదం జై తెలంగాణ అన్నారు. అల్లు అర్జున్, బాలకృష్ణ కూడా జై తెలంగాణ అన్నారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం జై తెలంగాణ అని అనడని ఎద్దేవా చేశారు. ఈ సందర్బంగా బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

- Advertisement -