డాక్టర్లు ఫుల్‌.. పేషెంట్లు నిల్‌: హరీశ్‌ ఆగ్రహం

46
harishrao
- Advertisement -

ఈఎస్‌ఐ దవాఖాన పనితీరుపై మంత్రి హరీశ్‌ రావు అసహనం వ్యక్తంచేశారు. దవాఖాన వివరాలు ఇవ్వకపోవడంతో సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు.సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో రూ.20 కోట్లతో ఆధునీకరించిన ఈఎస్‌ఐ దవాఖానను మంత్రి మంత్రి మల్లారెడ్డితో కలిసి హరీశ్‌ రావు ప్రారంభించారు. నలుగురు వైద్యులు నాలుగేండ్లుగా విధులకు రావడంలేదని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అదేవిధంగా హాస్పిటల్‌లో ప్రసవాలు ఎందుకు చేయడం లేదని సూపరింటెండెంట్‌ను నిలదీశారు.

పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై నెలలో మూడు డెలివరీలు మాత్రమే చేయడంపై సీరియస్‌ అయ్యారు. ఇక్కడ పనిలేకుండే పటాన్‌చెరు దవాఖానలో డ్యూటీ చేయాలని ఆదేశించారు. హాస్పిటల్‌లో డాక్టర్లు ఫుల్‌గా ఉన్నప్పటికీ పేషెంట్లు నిల్‌ వృత్తికి న్యాయం చేయాలని వైద్యులను కోరారు.

- Advertisement -