Harish:రేవంత్‌ రెడ్డికి ఆ అర్హత లేదు

18
- Advertisement -

మెదక్ అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. మెదక్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రోడ్ షోలో పాల్గొని మాట్లాడిన హరీష్.. బాండు పేప‌ర్‌కు జ‌ర ఇజ్జ‌త్, విలువ‌ ఉండే.. కాంగ్రెసోళ్లు ఆరు గ్యారెంటీలు బాండ్ పేప‌ర్ మీద రాసిచ్చిన త‌ర్వాత దాని ఇజ్జ‌త్ కూడా పోయిందన్నారు.

సిద్దిపేట‌, మెద‌క్, సంగారెడ్డి జిల్లాల‌కు మూడు మెడిక‌ల్ కాలేజీలు కేసీఆర్ మంజూరు చేశారు. రూ. 100 కోట్లు ఖ‌ర్చు పెట్టి మెద‌క్‌కు రైల్వే లైన్ తెచ్చిండు. క‌లెక్ట‌రేట్ నుంచి రాందాస్ చౌర‌స్తా వ‌ర‌కు నాలుగు లేన్ల దారి వేసింది కేసీఆర్ అన్నారు. వందరోజుల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఆరు గ్యారెంటీలు రాసిచ్చి..ఆ బాండ్ పేపర్ ఇజ్జత్ తీసిందన్నారు.

బీజేపీ అభ్య‌ర్థి మాట న‌మ్మ‌డమంటే నీళ్లు లేని బావిలో దూకిన‌ట్టే. ఎందుకంటే దుబ్బాక‌లో ఆడిన అబ‌ద్దాలే మ‌ళ్లీ ఆడుతున్నాడు. న‌యా నాట‌కాలు ఆడుతున్నాడు. రైతుల‌కు, ద‌ళితుల‌కు, బీసీల‌కు మేలు చేయ‌లేదు. అన్ని ధ‌ర‌లు పెంచారు. ధ‌ర‌లు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటేయాలి. మ‌తాన్ని పెట్టుకుని రాజ‌కీయం చేస్తుంది బీజేపీ. పేద‌ల గురించి ఆలోచించ‌డం లేదు అన్నారు.

Also Read:పౌష్టికాహార లోపమా..అయితే జాగ్రత్త!

- Advertisement -