Harishrao:బాధితులను ఆదుకోవడంలో విఫలం

19
- Advertisement -

సంగారెడ్డి జిల్లా చందాపూర్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో చనిపోయిన, గాయపడిన కార్మికుల బంధువులను ఫ్యాక్టరీ వద్ద పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. యాజమాన్యం పట్టించుకోవడం లేదని నిరసన తెలుపుతున్న బాధితులకు భరోసా. వారిని వెంటనే ఆదుకోవాలని కలెక్టర్‌కు ఫోన్ చేసి కోరడం జరిగింది.ఈ ప్రమాదం దురదృష్టకరం. బాధితులను ఆదుకోవడంలో యాజమాన్యం, ప్రభుత్వం విఫలం అయ్యాయి. సహాయ చర్యలు కూడా సరిగ్గా జరగలేదు..బాధితుల గోడు వినడం లేదన్నారు.

ప్రమాదంలో గాయపడ్డవారిని గాలికి వదిలేశారు. కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాయం కోరుతున్న వారిపై దురుసుగా ప్రవర్తించడాన్ని ఖండిస్తున్నాం…తమిళనాడు, మధ్యప్రదేశ్‌కు చెందిన మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. భౌతిక కాయాలను స్వస్థలాలకు చేర్చడానికి చర్యలు తీసుకోవాలన్నారు.ఆఫీసర్లను కేటాయించి అంబులెన్సుల్లో ఉచితంగా తరలించాలి. తక్షణమే కొంత ఆర్థిక సాయం చేయాలన్నారు. మృతదేహాలు చెడిపోకుండా అంబులెన్సుల్లో కూలర్లు పెట్టాలని డిమాండ్ చేశారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలి..అధికారుల, యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి…మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి పంపించాలన్నారు.

Also Read:RRR:రఘురామకు వైసీపీనే దిక్కా?

- Advertisement -