కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర ప్రమాదం పొంచిఉందని…సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, BRS డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ విషయంలో 07-04-2026 నాడు లేఖ రూపంలో BRS చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదు…అందువల్లే పంపులు దెబ్బతిని, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం చెందాయన్నారు.
తెలంగాణ జల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం దారుణంగా విఫలం అయిందని.. కృష్ణా జలాల వినియోగంలో చారిత్రక కనిష్ట స్థాయికి తెలంగాణ చేరుకుందన్నారు.ఏపీ 74% వినియోగిస్తే, తెలంగాణ 25% పరిమితం… రైతులు, తాగునీటి అవసరాలు, పరిశ్రమల భవిష్యత్తు ప్రమాదంలో పడేసింది కాంగ్రెస్ అన్నారు.
సోలార్ ఆధారిత విద్యుత్ విధానాలతో సాగునీటి రంగానికి ముప్పు..అందుకే రైతు డిస్కం ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి..లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి..కాళేశ్వరం, దేవాదుల నిర్వహణకు తగిన నిధులు కేటాయించాలి అని తెలిపారు.
1. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం
కాళేశ్వరం గాయత్రి పంపింగ్ స్టేషన్‌తో పాటు దేవాదుల తదితర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పంపులు, మోటార్లు దెబ్బతిన్నాయి.
భారీ మోటార్లను పదేపదే ఆన్-ఆఫ్ చేయడం వల్ల పరికరాలు దెబ్బతింటాయని ముందుగానే మేం హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలం.
వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కీలక సాగునీటి మౌలిక వసతులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నష్టపోతుండటం శోచనీయం.
ప్రాజెక్టులను బలహీనపరచి ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మోపే ప్రయత్నమా అన్న అనుమానం కలుగుతుంది.
2. ట్రాన్స్‌కో సూచనలపై ప్రశ్నలు
సోలార్ విద్యుత్ అందుబాటులో ఉండే పగటి వేళల్లోనే లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు నడపాలని ట్రాన్స్‌కో సూచించడం వల్ల, భారీ పంపులను తరచూ స్టార్ట్, స్టాప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
పంపులు, మోటార్ల నష్టం ఈ విధానాల వల్ల జరిగి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే.
ఈ నిర్ణయాలకు ముందు సాంకేతిక అధ్యయనం జరిగిందా లేదా అనేది అసలు ప్రశ్న.
3. జీఓ ఎంఎస్ నం.8 వల్ల కలిగే ప్రమాదం
జీఓ ఎంఎస్ నం.8 ద్వారా టీజీఆర్‌పీడీసీఎల్‌కు అధిక పునరుత్పాదక (సోలార్) విద్యుత్ కేటాయింపు.
సోలార్ విద్యుత్ ప్రధానంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అందుబాటులో ఉంటుంది.
దీంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంపింగ్ కార్యకలాపాలు పరిమిత సమయానికే కట్టుబడే ప్రమాదం.
నీటి ఎత్తిపోతలు తగ్గి, కృష్ణా-గోదావరి జలాల వినియోగ సామర్థ్యం దెబ్బతింటాయి.
4. తెలంగాణ జల హక్కులకు ముప్పు
కాళేశ్వరం, దేవాదుల,పాలమూరు ఇతర ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకోవడం.
విద్యుత్ లభ్యత ఆధారంగా పంపింగ్‌ను పరిమితం చేయడం రాష్ట్ర జల హక్కులకు విరుద్ధం.
నీటి వినియోగం తగ్గితే వ్యవసాయం, తాగునీరు, భూగర్భ జలాలు, చేపల పెంపకం, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, గ్రామీణ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుంది.
5. కాంగ్రెస్ పాలనలో కృష్ణా జలాల వినియోగం కనిష్ట స్థాయికి
తెలంగాణకు కేటాయించిన తాత్కాలిక వాటా 34% కాగా, ఆంధ్రప్రదేశ్‌కు 66%. 2024-25లో ఆంధ్రప్రదేశ్ 72.73% నీటిని వినియోగించగా, తెలంగాణ కేవలం 27.27% మాత్రమే వినియోగించింది.
2025-26లో ఆంధ్రప్రదేశ్ వినియోగం 74.90%కి పెరగగా, తెలంగాణ వినియోగం చారిత్రక కనిష్టమైన 25.10%కి పడిపోయింది. నీటి లభ్యత అధికంగా ఉన్నప్పటికీ తెలంగాణ తన వాటా నీటిని కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోయింది.తెలంగాణ జల హక్కులను, రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇది మరో నిదర్శనం.
BRS ప్రధాన డిమాండ్లు
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పంపింగ్ సీజన్‌లో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలి.
తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాల పూర్తి వినియోగం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి.
రైతు డిస్కం (Rythu DISCOM) ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి.కాళేశ్వరం, దేవాదుల తదితర ప్రాజెక్టుల నిర్వహణ, ఆధునీకరణకు తగిన బడ్జెట్ కేటాయించాలి.వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి తదితర రంగాలకు తగిన నీటి లభ్యతను నిర్ధారించాలి.
Also Read;గ్రేట్ నికోబార్‌ను కాపాడుకుందాం!

